నేటి నుంచి నామినేషన్ల పర్వం


Mon,March 18, 2019 02:35 AM

నిజామాబాద్ సిటీ: పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కోసం కలెక్టరేట్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు నేతృత్వంలో సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. సోమవారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటలలోపు నామినేషన్లు స్వీకరిస్తారు. దీనికిగాను ఎన్నికల నియమావళి ప్రకారం రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100మీటర్ల దూరంలోనే వాహనాలు నిలిపి రావాలని ఇదివరకే అన్ని రాజకీయ పార్టీలకు సూచించారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. వీరు నామినేషన్ దాఖలు పత్రాలను వెంట తీసుకొని రావాల్సి ఉంటుంది. ఈనెల 18నుంచి 25 వరకు జరిగే నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 21, 23, 24 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదనే విషయాన్ని అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది.

25న సాయంత్రంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ డీఎస్‌ఏ కార్యాలయంలో మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎప్పటికప్పుడు మీడియాలో ప్రసారమయ్యే కథనాలు, ఇతర వార్తలకు సంబంధించి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రసారమైతే తగిన చర్యలు తీసుకోనున్నట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. దీనిపై మీడియా ప్రతినిధులు, అభ్యర్థులు సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. అంతేగాకుండా మీడియా కవరేజ్ కోసం వచ్చే వారి కోసం కలెక్టరేట్‌లోనే టెంట్, కుర్చీలు, తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. ఇక అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధపడుతుండగా.. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. లోక్‌సభ ఎన్నికలు తొలి విడతకు సంబంధించి ఈనెల 18 నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 26 స్క్రూటీ పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుంది. మే 23న ఫలితాలు వెల్లడిస్తారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...