టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు


Mon,March 18, 2019 02:34 AM

జక్రాన్‌పల్లి: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు 50 మంది యువకులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేశారు. ఆదివారం నిజామాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో వారికి ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ కవిత గెలుపే లక్ష్యంగా సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ వచ్చేలా అలుపెరుగని కృషిచేయాలన్నారు. కాంగ్రెస్ నాయకులు పోతే రాజు, పోతే యమున, లక్ష్మీనారాయణ, క్రాంతి, అరుణ్, షద్రక్, స్వామి, గంగాధర్, సుదర్శన్, చంద్రశేఖర్, గోపి, బాలన్న, ప్రభాకర్, బుజ్జన్న, ప్రవీణ్, బుల్లెట్ గంగాధర్, రాంచందర్‌తో పాటు గ్రామానికి చెందిన మరో 50 మంది యువకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నీట్ శేఖర్, టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు సంజీవ్, రాకేశ్, లక్ష్మణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...