ప్రజలు మెచ్చేలా పనిచేయాలి


Sun,March 17, 2019 03:32 AM

కమ్మర్‌పల్లి/నమస్తే తెలంగాణ: సర్పంచులు ప్రజలు మెచ్చేలా పనిచేసి టీఆర్‌ఎస్‌కు మంచి పేరు తేవాలని జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా, పలు పార్టీల మద్దతుతో గెలిచిన 21 మంది సర్పంచులతో పాటు పలువురు ఉపసర్పంచులు, వార్డు సభ్యులు శనివారం వేల్పూర్‌లో మం త్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నివాసంలో ఎంపీ కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎంపీ కవిత, మంత్రి ప్రశాంత్‌రెడ్డి వారికి టీఆర్‌ఎస్ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ..

నూతనంగా చేరిన సర్పంచులంద రూ ప్రజలకు మంచి సేవలందించి కేసీఆర్ పేరును నిలబెట్టేలా కృషిచేయాలని కోరారు. సర్పంచులు నూతన పంచాయతీరాజ్ చట్టం పై సంపూర్ణ అవగాహనతో పనిచేస్తూ నూతన పంచాయతీరాజ్ చట్టం లక్ష్యాన్ని నెరవేర్చాలని కోరారు. గ్రామాలకు పంచాయతీల ద్వారా అందాల్సిన సేవలన్నీ అందేలా చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. నూతన సర్పంచులందరూ తమ విధుల్లో విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రజల్లో ఉండే పార్టీ అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలోని మొత్తం సీట్లను టీఆర్‌ఎస్ గెలుచుకుంటే, కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన హక్కులను, అభివృద్ధిని సగర్వంగా సాధించుకోగలగుతామన్నా రు.

తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చూపిన ఆదరణపై కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సాధించిన ఫలితాలను మించి పార్లమెంటు ఎన్నికల్లో సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈనెల 19న జిల్లా కేం ద్రంలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవడానికి కేసీఆర్ ఆలోచనలు, ఆయన నాయకత్వమే కారణమన్నారు. కేసీఆర్ అడుగుజాడల్లో నడవడం అదృష్టమన్నారు. కష్టపడే వారికి పార్టీలో ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తూ పార్టీ ఇమేజ్ పెరిగేలా పనిచేయాలని సూచించారు.

కేంద్రం వివక్షను ఎండగట్టాలంటే టీఆర్‌ఎస్ గెలవాలి
-మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
రాష్ర్టాలపై కేంద్రం వివక్షను ఎండగట్టాలంటే ప్రాంతీయ పార్టీలు గెలవాలని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, రవాణా, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించడమే మనముందున్న లక్ష్యమని నూతనంగా చేరిన సర్పంచులకు పిలుపునిచ్చారు. ఇందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. జిల్లా అభివృద్ధి కోసం, పసుపు బోర్డు సాధన కోసం, తెలంగాణ హక్కుల కోసం ఎంపీ కవిత పార్లమెంటులో రాజీలేని పోరాటం చేస్తున్నారన్నారు. రాష్ర్టాన్ని అన్ని విధాలా ప్రగతిపథాన నిలపడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. ఈ లక్ష్య సాధనలో టీఆర్‌ఎస్ అన్ని స్థానాల్లో గెలువాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు. అరవై ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ, ఇరవై ఏళ్లలో టీడీపీ తెలంగాణకు నష్టమే తప్ప లాభం చేకూర్చలేదన్నారు. ఈనెల 19న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కోరారు. నూతనంగా చేరిన సర్పంచులకు స్వాగతం పలికారు. నాన్ బీజేపీ రాష్ర్టాలపై వివక్షను లేకుండా చేయాలంటే ప్రాంతీయ పార్టీలను గెలిపించుకోవాలన్నారు.

పార్టీలో చేరిన సర్పంచులు వీరే...
ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో మోర్తాడ్ మండలం నుంచి మోర్తాడ్ సర్పంచ్ భోగ ధరణి, సుంకేట్ సర్పంచ్ కడారి శ్రీనివాస్, దొన్కల్ కత్తి లావణ్య, ధర్మోరా సర్పంచ్ మండల రాజేశ్వర్, శెట్‌పల్లి సర్పంచ్ బద్దం గంగారెడ్డి, దోన్‌పాల్ సర్పంచ్ పర్స దేవన్న, మెండోరా మండలం నుంచి సోన్‌పేట్ ఉపసర్పంచ్ గొలి ప్రకాశ్, ముప్కాల్ మండలం నుంచి కొత్తపల్లి సర్పంచ్ విష్ణు మరేళ్లి, ముప్కాల్ సర్పంచ్ కోమ్ముల శ్రీనివాస్, వెంచిర్యాల్ సర్పంచ్ మట్ట సందీప్, ఏర్గట్ల మండలం నుంచి ఏర్గట్ల సర్పంచ్ లావణ్య, తడ్‌పడకల్ సర్పంచ్ పత్తిరెడ్డి ప్రకాశ్, ఉపసర్పంచ్ లోలపు అశోక్, వేల్పూర్ మండలం నుంచి రామన్నపేట్ జాగీరపు వీణా, జాన్కంపేట్ సర్పంచ్ సౌడ ప్రేమలత, పోచంపల్లి సర్పంచ్ అనంత్‌రావు దేశ్‌పాండే,

భీమ్‌గల్ మండలం నుంచి జా గిర్యాల్ సర్పంచ్ కోణగుర్తి మానస, బడా భీమ్‌గల్ సర్పంచ్ ఏరోళ్ల సంజీవ్, గొన్‌గోప్పుల సర్పంచ్ రాగి అనసూయ, సికింద్రాపూర్ సర్పంచ్ బండారి సంధ్య, బాబాపూర్ సర్పంచ్ అయేశా సిద్ధికీ ఫిర్‌దోస్, బాల్కొండ మండలం నుంచి బాల్కొండ సర్పంచ్ బూస సునీ త, బోదేపల్లి సర్పంచ్ నోముల రవి, బట్టాపూర్ సర్పంచ్ కటకం శ్యామంత్‌రెడ్డి, ఉప సర్పంచ్ సీహెచ్ కిషన్ చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, రెడ్‌కోచైర్మన్ ఎస్‌ఏ అలీం, రాష్ట్ర నాయకులు దాదన్నగారి విఠల్‌రావు, డాక్టర్ మధుశేఖర్, ఎంపీపీలు పాలెపు రజిత, కల్లెడ చిన్నయ్య, కొండ గోదావరి, అర్గుల రాధ, మాలావత్ కౌసల్య, జడ్పీటీసీలు వెల్మల విమల, బాదావత్ లక్ష్మినాయక్, దాసరి లక్ష్మి, ఎనగందుల అమిత, ఆయా మండలాల టీఆర్‌ఎస్ అధ్యక్షులు రాజాపూర్ణానందం, సామ వెంకట్‌రెడ్డి, నాగంపేట్ శేఖర్‌రెడ్డి, మిట్టాపల్లి మహిపాల్, గున్వీర్ రెడ్డి, దాసరి వెంకటేశ్, చుక్క గంగాధర్, లుక్క గంగాధర్ పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...