నిబంధనలకు విరుద్ధమైన ప్రసారాలపై చర్యలు


Sun,March 17, 2019 03:30 AM

- మీడియా కే్ంరద్రం ప్రారంభం
- రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
- కలెక్టర్ రామ్మోహన్‌రావు

నిజామాబాద్ సిటీ : పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కేం ద్రాన్ని శనివారం కలెక్టర్ రామ్మోహన్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకల్ కేబుల్ నెట్‌వర్క్‌లో ప్రసారమయ్యే వా ర్తల రికార్డు ప్రక్రియను, మీడియా కేంద్రం ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లోకల్ కేబు ల్ నెట్‌వర్క్‌లో ప్రసారమయ్యే వార్తలను 24 గంటల పాటు రి కార్డు చేసి ఆ వార్త ఎన్నికల నిబంధనల మేరకు ఉందో లేదో పరిశీలించి సంబంధిత అభ్యర్థులకు అనుమానాస్పద పెయిడ్ న్యూ స్ గావించి నోటీసులు జారీ చేస్తామని చెప్పారు.

వివిధ న్యూస్ పేపర్‌లో ప్రచురితమైన వార్తలను కూడా పరిశీలన చేసి కమిషన్ నిర్ధేశించిన ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుగుణంగా చర్య లు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన స మాచారాన్ని మీడియాకు తెలిపేందుకు జిల్లా పౌర సం బంధాల అధికారులు, వారి సిబ్బంది ఇక్కడి నుంచే అందజేస్తారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తె లిపారు. ఈనెల 18వ తేదీన నామినేషన్ల ప్రక్రియ నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు, ఉదయం 11 నుంచి 3 గంటల వరకు స్వీకరిస్తారన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థులు 100మీటర్ల దూరంలో మూడు వాహనాల కంటే ఎక్కువ తీసుకొని రాకూడదని,అభ్యర్థితో కలిపి ఐదుగురు కంటే ఎక్కువగా ఆర్వో గదిలోకి రాకూడదని చెప్పారు.

ఈ నెల 21, 23, 24 తేదీల్లో ప్రభుత్వ సెలవులు ప్రకటించినందున నామినేషన్లు స్వీకరించబడవని, అభ్యర్థులకు అవగాహన కల్పించేం దుకు కలెక్టరేట్‌లో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామ న్నారు. ప్రకటనలు, ఆడియో, వీడియో పబ్లిసిటీ వాహనాలకు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ద్వారా ముందస్తు అ నుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. జేసీ ఎం.వెంకటేశ్వ ర్లు, డీఆర్వో ఆర్.అంజయ్య, సమాచారశాఖ ఉపసంచాలకుడు మహ్మద్ ముర్తుజా, రేడియో సమాచార ఇంజినీర్ వెంకటయ్య, అడిషనల్ పీఆర్వో రామ్మోహన్‌రావు, మాజీద్ పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...