సంక్షేమ పథకాలు వివరించాలి


Sun,March 17, 2019 03:29 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు వేగుచుక్కల్లా పనిచేయాలని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. మామిడిపల్లిలోని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి నివాసంలో శనివారం నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలు దేశానికే దిక్సూచిగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికీ, ప్రతి మనిషికీ వివరించి రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

నియోజకవర్గంలోని ఆర్మూర్ మండల, ఆర్మూర్ మున్సిపల్, మాక్లూర్, నందిపేట్ మండలాల నాయకులు, కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి వారికి రాబోయే ఎన్నికల్లో చేయాల్సిన పనుల గురించి ఎంపీ కవిత వివరించారు. గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో కంటే భారీగా మెజార్టీ వచ్చేలా నాయకులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలన్నారు.

నాలుగు లక్షల మెజార్టీతో గెలిపించుకుందాం : ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
జిల్లా ఎంపీగా కల్వకుంట్ల కవితను నాలుగు లక్షల పైచిలుకు మెజార్టీతో గెలిపించుకుందామని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఎంపీగా కల్వకుంట్ల కవితకు భారీ మెజార్టీ తేవడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మధుశేఖర్, ఎల్‌ఏంబీ రాజేశ్వర్, మానస గణేశ్, ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ కశ్యప్ స్వాతిసింగ్, వైస్ చైర్మన్ లింగాగౌడ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ యమాద్రి కవితాభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...