పొట్టి శ్రీరాములు జయంతి


Sun,March 17, 2019 03:28 AM

బోధన్, నమస్తే తెలంగాణ : బోధన్ పట్టణంలో ఆర్యవైశ్య సం ఘం, వాసవీ వనితాక్లబ్‌ల ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వాసవీక్లబ్ రీజినల్ చైర్‌పర్సన్ పబ్బ మురళీ మా ట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడిగా ఆయన చేసిన త్యాగా లు ఎనలేనివని అన్నారు. ఈ కార్యక్రమాన్ని వనితా క్లబ్ అధ్యక్షురాలు జయశ్రీ నివాసంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆ ర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు కొత్త రవీందర్ గుప్తా, డివిజన్ అధ్యక్షుడు కంటాల రమేశ్, వాసవీ క్లబ్ జోన్ చైర్ పర్సన్ క ల్పన, బిల్లకంటి అనీల్‌కుమార్, వాసవీ క్లబ్ అధ్యక్షుడు బండారు నవీన్ కుమార్, వనితా క్లబ్ అధ్యక్షురాలు జయశ్రీ, సుప్రియ, మేఘమాల, గోవింద్, బాలకృష్ణ పాల్గొన్నారు.

పిచ్చిమొక్కల తొలగింపు
బోధన్ రూరల్ : బోధన్ మండలంలోని ఎరాజ్‌పల్లి గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం శనివారం నాటికి మూడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు ఎరాజ్‌పల్లి నుంచి మోస్రా వెళ్లే రోడ్డుకు ఇరువైపులా పిచ్చిమొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం గ్రామంలోని యువత సహకారంతో అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గురువరెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రవీన్‌కుమార్, శ్వేత, వలంటీర్లు పాల్గొన్నారు.

బెల్లాల్‌లో..
బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామంలో విద్యావికాస్ జూనియార్ కళాశాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యే క శిబిరం శనివారంతో 4వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఎ న్‌ఎస్‌ఎస్ విద్యార్థులు గ్రామంలో నిరక్షరాస్యత, నిరుద్యోగ సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఎస్ వలంటీర్లు ఉన్నారు.

పంటలకు సాగునీరు విడుదల
నవీపేట : మండలంలోని అభంగపట్నం ఎర్రకుంట మినీ రిజ ర్వాయర్ నుంచి పంటలకు సాగునీటిని శనివారం విడుదల చేసి నట్లు ఇరిగేషన్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని మోక న్‌పల్లి, నవీపేట, కమలాపూర్ తదితర గ్రామాల రైతుల విన్నపం మేరకు వరి పంట పొట్ట దశలో ఉన్నందున పంటలు ఎండి పోకుండా అభంగపట్నం గ్రామ పెద్దలను ఒప్పించి నీటి విడు దలపై నిర్ణయం తీసుకొని విడుదల చేసినట్లు చెప్పారు. ఎర్రకుం ట నీటి విడుదలపై ఆయా గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ రమాదేవి, భరత్‌రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...