పదో తరగతి పరీక్షా కేంద్రాల తనిఖీ


Sun,March 17, 2019 03:27 AM

రెంజల్/వర్ని/బోధన్ రూరల్/నవీపేట/ఎడపల్లి/రుద్రూర్ : రెంజల్ మండలంలోని ఆదర్శ పాఠశాల, నీలా జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం ప్రారంభమైన పదోతరగతి పరీక్షల్లో 476 మంది విద్యార్థులకు గాను ఒకరు గైర్హాజరైనట్లు ఎంఈవో గణేశ్‌రావు తెలిపారు. రెంజల్ ఆదర్శ పాఠశాల పరీక్ష కేంద్రంలో 330 మంది విద్యార్థులకు గాను 229 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. రెంజల్ జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన సందీప్ అనే విద్యార్థి గైర్హాజరైనట్లు ఎంఈవో తెలిపారు. నీలా పరీక్ష కేంద్రంలో 146 మంది పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. రెంజల్ పరీక్షా కేంద్రాన్ని తహసీల్దార్ అసదుల్లాఖాన్, ఎస్సై శంకర్‌లు సందర్శించారు. వర్ని మండలంలో 1,068 విద్యార్థులకు గాను 1064 విద్యార్థులు హాజరుకాగా నలుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. బోధన్ మండలంలోని మొత్తం 3,180 మంది విద్యార్థులకుగాను 12 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఎంఈవో శాంతకుమారి తెలిపారు.

నవీపేట మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లోని కేంద్రా ల్లో శనివారం నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో 707 వి ద్యార్థులకు గాను 706 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఒకరు గైర్హాజరైనట్లు ఎంఈవో గణేశ్‌రావు తెలిపారు. కాగా ఈ కేంద్రాల్లో డీఆర్‌డీఏ పర్యవేక్షకులు నర్సింలు తనిఖీలు చేసినట్లు చెప్పారు. ఎడపల్లి మండలంలో ఒక విద్యార్థి గైర్హాజరైనట్లు ఎంఈవో రామారావు తెలిపారు. రుద్రూర్ మండలంలో ఒకరు గైర్హాజరైనట్లు ఎంఈవో శాంతకుమారి తెలిపారు.

పరీక్షా కేంద్రం తనిఖీ
కోటగిరి : మండలంలోని పొతంగల్, కోటగిరిలో పదో తరగతి పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్‌స్కాడ్ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటి రోజు శనివారం రోజున ఫ్లయింగ్ స్కాడ్ రామారావు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఎంత మంది విద్యార్థులు ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. పరీక్షలు అయ్యే వరకు ఇతరులను లోపలికి అనుమతి ఇవ్వకూడదని తెలిపారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...