సీఎం సన్నాహక సభను విజయవంతం చేయాలి


Sun,March 17, 2019 03:26 AM

నవీపేట : నిజామాబాద్ పట్టణంలోని గిరిరాజ్ కాలేజీ గ్రౌం డ్‌లో ఈనెల 19 నిర్వహించే సీఎం కేసీఆర్ సన్మాహక సభ ను కార్యకర్తలందరు సమష్ఠిగా విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్.రాంకిషన్‌రావు కోరారు. వచ్చే నెల 11న నిర్వహించే పార్లమెంట్ ఎన్నికలకు సమ యం దగ్గర పడుతుండడంతో కార్యకర్తలు ఆయా గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాల ను ప్రజలకు వివరిస్తూ, ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్ రాకుం డా, ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు.

నవీపేట మం డలం నుంచి 1,200 మంది జనాలను ఆయా గ్రామాలకు కేటాయించిన వాహనాల్లో సీఎం సభకు తరలించి ప్రతి కా ర్యకర్త సీఎం సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని విజయవం తం చేసేందుకు కృషి చేయాలని రాంకిషన్‌రావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు వి.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించుకోవడమే మన ముందున్న ప్రథ మ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నవీపేట మండ ల అధ్యక్షుడు నర్సింగ్‌రావు, ము వ్వ నాగేశ్వర్‌రావు, తెడ్డు పోశెట్టి, నవీపేట సర్పంచ్ ఆసోల్ల శ్రీనివా స్, మోస్రా సాయరెడ్డి, అల్లం రమే శ్, మైనార్టీ నాయకులు ఉమర్, అ ప్సర్, జనార్దన్ రెడ్డి, అల్తాఫ్, మ హేందర్, ముజీబ్, బెల్లాల్ నర్సింగ్‌రావు, సంజీవ్‌రావు, మల్లయ్య, సురేశ్, గుత్తి సాయిలు, డాంగే పో తన్న, భూమయ్య, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...