కార్యకర్తలకు ఎంపీ కవిత దిశానిర్దేశం


Sat,March 16, 2019 12:45 AM

బోధన్, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బోధన్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు, ముఖ్య కార్యకర్తలతో శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత సమావేశమై ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ సాధించేదిశగా వారికి దిశానిర్దేశం చేశారు. బోధన్ పట్టణంలోని ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ నివాసగృహంలో వివిధ మండలాల వారీగా కార్యకర్తల స మావేశాలను నిర్వహించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలు మొదలు జూన్ వరకు వరుసగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని, ఎ న్నికల్లో టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీలు తీసుకురావాలని కవిత పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో టీఆర్‌ఎస్ నిర్ణయాత్మక పాత్రను పోషించనుందని, దేశంలో సుస్థిర పాలన ఇచ్చే దక్షత సీఎం కేసీఆర్‌కు ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీతో విజయం చేకూర్చేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, దేశానికి టీఆర్‌ఎస్ నాయకత్వం వహించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు. 19న నిజామాబాద్ గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగే సీఎం కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున జనం తరలిరావాలని, ఆ సభను విజయవంతం చేయాలని కోరారు. బోధన్ తనకు సొంత అసెంబ్లీ నియోజకవర్గం కావడంతో బోధన్‌లో ఎంపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని, ఎమ్మెల్యే షకీల్ ఆధ్వర్యంలో వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యాలయంతో సమన్వయం చేసుకోవచ్చని కవిత తెలిపారు. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు టీఆర్‌ఎస్ పార్టీ బలపర్చుతోందన్నారు.

సమావేశాల్లో బోధన్ శాసనసభ్యుడు మహ్మద్ షకీల్ మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టి లో ఉంచుకుని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గతంలో కంటే ఎక్కువ మెజార్టీలు వచ్చేలా టీఆర్‌ఎస్ కార్యకర్తలు పనిచేయాలన్నారు.

సమావేశాల్లో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్.రామకిషన్‌రావు, జిల్లా నాయకులు దాదన్నగారి విఠల్‌రావు, వి.మోహన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ, బోధన్ ము న్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, పార్టీ బోధన్ నియోజకవ ర్గం నాయకులు గిర్దావర్ గంగారెడ్డి, బుద్దె రాజేశ్వర్, ఎం.అప్పిరెడ్డి, పి.రవికిరణ్, ఎం.ఎ.రజాక్, పార్టీ బోధ న్ పట్టణ అధ్యక్షుడు వీఆర్ దేశాయ్, ఎడపల్లి ఎంపీపీ చైర్మన్ రజితా యాదవ్, వివిధ మండలాల అధ్యక్షులు సంజీవ్‌కుమార్, డి.నర్సింగ్‌రావు, భూమ్‌రెడ్డి, వివిధ మండలాల నా యకులు పి.గోపాల్‌రెడ్డి, కేపీ శ్రీనివాస్‌రెడ్డి, సాలూర షకీల్, కాశం సాయిలు, ధనుంజయ, రఫీయోద్దీన్, అల్లం రమేశ్, మల్కారెడ్డి, గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ కవిత సమక్షంలో..పెద్ద ఎత్తున సర్పంచుల చేరికలు..
బోధన్‌లో శుక్రవారం జరిగిన బోధన్ నియోజకర్గంలోని ఆ యా మండలాల టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశాల్లో ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన వివిధ పార్టీల సర్పంచ్‌లు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎంపీ కవిత బోధన్ ఎమ్మెల్యే షకీల్‌తో కలిసి వారికి గులాబీ కండువాలు కప్పారు. టీఆర్‌ఎస్‌లో చేరినవారిలో బోధన్ మండలానికి చెందిన హూన్సా సర్పంచ్ శీ ల గంగామణి, హంగర్గా సర్పంచ్ శ్యామ్‌రావు, భిక్నెల్లి సర్పం చ్ నాగకళ, సిద్ధాపూర్ సర్పంచ్ అశోక్ పటేల్, ఊట్‌పల్లి స ర్పంచ్ కృష్ణ ఉన్నారు. నవీపేట్ మండలం నుంచి ఇంతకుముందు నిజాంపూర్ సర్పంచ్ టీఆర్‌ఎస్‌లో చేరగా గురువా రం ఎంపీ కవిత సమక్షంలో మరో ఏడుగురు సర్పంచ్‌లు టీఆర్‌ఎస్‌లో చేరారు.

టీఆర్‌ఎస్‌లో చేరినవారిలో నాళేశ్వర్ సర్పంచ్ సరిన్, మహం తం సర్పంచ్ రాజేశ్వర్, నాగేపూర్ సర్పంచ్ కె.స్వరూప, అ బ్బాపూర్ (బీ) సర్పంచ్ జ్యోతి శోభన్, మద్దేపల్లి సర్పంచ్ రే ణుకా రవి, ఆశాజ్యోతి కాలనీ సర్పంచ్ సంధ్యారాణి, లింగాపూర్ సర్పంచ్ లహరి ఉన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...