రాష్ట్రస్థాయి టీఎన్జీవోస్ క్రీడల్లో జిల్లాకు పతకాలు


Wed,February 20, 2019 02:38 AM

నిజామాబాద్ సిటీ : తెలంగాణ రాష్ట్రస్థాయి టీఎన్జీవోస్ క్రీడల్లో జిల్లా ఉద్యోగులు మెరుగైన ప్రతిభను కనబరుస్తున్నారు. జిల్లాస్థాయిలో నిర్వహించిన వివిధ పోటీలలో పతకాలను సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైన ఈ ఉద్యోగులు 10జిల్లాలతో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పోటీల్లోనూ దూకుడుగా ఆడుతూ పతకాలతో రాణిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న రెండోరోజు క్రీడల్లో భాగంగా మహిళల విభాగంలో 100మీటర్ల పరుగులో దివ్య స్వర్ణ, షాట్‌ఫుట్‌లో ప్రియాంక రజత, 45ఏళ్ల పైబడిన మహిళల విభాగంలో 100మీటర్ల పరుగులో వసుమతి దేవి స్వర్ణ పతకాలు, పురుషుల విభాగంలో నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్‌లో జిల్లా జోడి సెమీఫైనల్స్‌కు చేరుకుంది. అదేవిధంగా క్యారమ్స్ విభాగంలోనూ జిల్లా క్రీడాకారులు సెమీఫైనల్స్‌కు ప్రవేశించారు. చెస్ పోటీలలో జిల్లా క్రీడాకారుడు శ్రీనివాస్ మెరుగైన ప్రతిభను ప్రదర్శించి సెమీఫైనల్స్‌కు చేరుకున్నాడు. ఇక హైదరాబాద్, నిజామాబాద్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ జట్టు నిర్ణీత 12ఓవర్లలో 92పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు పరుగులకే అలౌటైంది. దీంతో జిల్లా ఉద్యోగుల జట్టు 5పరుగుల తేడాతో జిల్లాజట్టు ఘనవిజయం సాధించింది. టిఎన్‌జిఓస్ ఉమ్మడి జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు అలుక కిషన్, దయానంద్, అమృత్‌కుమార్, వెంకట్‌డ్డి, నారాయణడ్డి, వెంక సుమన్‌కుమార్, సుధాకర్, జాఫర్, పోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...