టీఆర్‌ఎస్ హయాంలోనే గిరిజనులకు గుర్తింపు


Sat,February 16, 2019 02:38 AM

వినాయక్‌నగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లంబాడీలను గుర్తించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించి గిరిజనుల గౌరవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పెంచారని అన్నారు. శుక్రవారం నగరంలోని 50వ డివిజన్‌లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహరాజ్ 280వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోగ్ బండార్ నిర్వహించగా అర్బన్ శాసన సభ్యులు బిగాల గణేశ్‌గుప్తా, నగర మేయర్ ఆకుల సుజాత, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి సంధ్యారాణి, నగర పాలక సంస్థ కమిషనర్ జాన్ సాంసన్, డీఆర్డీవో రాములు, కార్పొరేటర్ చాంగుబాయి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ గుర్తించాలనే ఉద్దేశంతో కుల, మతాలకు అతీతంగా పండుగలు నిర్వహిస్తున్నదని అన్నారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ గురించి మాట్లాడారని, బంగారు తెలంగాణ అంటే ప్రతి కులం, మతం సుఖశాంతులతో ఉండాలని, అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేయడానికి సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారని అన్నారు. ఎవరూ చేయని విధంగా తండాలను గ్రామ పంచాయతీలు ఏర్పాటుచేసిన ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. రానున్న రోజుల్లో కల్యాణ మండపం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పోతుల పురుషోత్తం, సిర్ప సువర్ణ, దారం సాయిలు, టీఆర్‌ఎస్ నాయకులు మంగిలాల్, చథుర్‌సింగ్ రాథోడ్, నీలగిరి రాజు, డాక్టర్ మోతిలాల్, యూత్ నాయకుడు అవధూత మహేశ్, సత్యపాల్, సుజిత్ సింగ్ ఠాకూర్, పృథ్విరాజ్, న్యాలం రాజు, రాజేశ్, బంజారా నాయకులు, యువతి యువకులు, మహిళలు పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...