తొలిపోరు.. గులాబీదే జోరు..


Tue,January 22, 2019 01:50 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: గ్రామ పోరులో టీఆర్ దూకుడును కనబర్చింది. టీఆర్ కంచుకోటగా ఉన్న ఇందూరులో పల్లెలన్నీ ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులకే జైకొట్టాయి. సోమవారం జరిగిన తొలివిడత గ్రామపోరులో భారీగా పోలింగ్ పాల్గొని మరోమారు తమ చైతన్యాన్ని నిరూపించారు. ఉదయం నుంచే బారులు తీరి ఓటింగులో పాల్గొన్నారు. మహిళామణులు పె ద్ద ఎత్తున ఈ పోలింగులో పాల్గొన్నారు. జిల్లా యం త్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో ప్రశాంతంగా పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో వెసులుబాటు కలిగింది. జిల్లా కలెక్టర్ ఎం. రామ్మోహన్ సీపీ కార్తికేయ శర్మ తదితర జిల్లా యంత్రాంగం తొలివిడత ఎన్నికల, కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సజావుగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నారు. కాగా మధ్యాహ్నం పోలింగ్ ముగిసిన తర్వాత వెంటనే కౌంటింగ్ ప్రక్రియను మొదలుపెట్టారు. కొన్ని మండలాల్లో జరిగిన జాప్యంతో రాత్రి 10గంటల తర్వాత కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.

అయితే జిల్లాలో జరిగే తొలివిడత ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో మొత్తం 177 పంచాయతీలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా ఇప్పటికే 36 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 141 పంచాయతీలకు, 1,004 వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయి. టీఆర్ హవా అన్ని పంచాయతీ పరిధిలో కొనసాగింది. ఆది నుంచి కౌంటింగ్ ప్రక్రియలో టీఆర్ దూకుడు కనబర్చింది. ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులకే పల్లె ప్రజలు జైకొట్టారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలు పల్లె పోరులో చతికిలబడ్డాయి. పత్తా లేకుండా పోయాయి. దీంతో పల్లె సీమలన్నీ గులాబీమయమయ్యాయి. సర్పంచ్ ఫలితాల తర్వాత ఉపసర్పంచ్ ఎన్నుకునే ప్రక్రియను నిర్వహించారు. వార్డు సభ్యులుగా గెలుపొందిన వారు మెజార్టీగా బలపర్చిన వార్డు మెంబర్ ఉపసర్పంచ్ చేతులెత్తి తమ అంగీకారం తెలపడం ద్వారా ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది. అయితే తొలివిడత పోరులో మొత్తం 6 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. స్థానిక ప్రజలకు వీటిపై అవగాహన లేకపోవడంతోనే నామినేషన్లు దాఖలు కాలేదని అధికారులు తెలిపారు. వీటికి ఉప ఎన్నిక నిర్వహిస్తారు. అయితే గతంలో వార్డు సభ్యులందరూ ఉంటే ఉప సర్పంచ్ ఎన్నిక జరిగేది. కొత్త పంచాయతీరాజ్ చట్టం అనుసరించి మెజార్టీగా ఇప్పుడున్న సభ్యులు ఎవరిని ఎన్నుకుంటే వారు ఉపసర్పంచ్ ఎన్నికవుతారు.

పల్లెల్లో నయాజోష్...
పోలింగ్ ముగియగానే మొదలైన కౌంటింగ్ ప్రక్రియతో పల్లెల్లో మధ్యాహ్నం నుంచే సందడి వాతావరణం నెలకొన్నది. ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్న తరుణంలో పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఆ పార్టీ జెండాలతో కార్యకర్త లు, అనుచరులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, మిఠాయిలతో నోరు తీపి చేసుకున్నారు. టీఆర్ పార్టీ బలపర్చిన అభ్యర్థులే అన్ని చోట్ల గెలవడం తో పల్లెలు గులాబీమయమయ్యాయి. ఎమ్మెల్యేలు సైతం ఎప్పటికప్పుడు పోలింగ్, కౌంటింగ్ సరళిని పర్యవేక్షించారు. బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తమ తమ నియోజకవర్గాల్లో ఫలితాల పై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందడంతో సంతోషం వ్యక్తం చేశారు. గెలిచిన కొత్త సర్పంచులకు ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు.

మహిళా ఓటర్ల చైతన్యం...
నిజామాబాద్ జిల్లాలో తొలివిడత గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో 177 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే 36 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 141 సర్పంచ్ స్థానాలకు, 1,004 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ బరిలో 545 మంది ఉండగా వార్డు సభ్యుల స్థానాల కోసం 2,386 మంది పోటీలో నిలిచారు. కాగా తొలివిడత పోరులో మొత్తం 78.56 పోలింగ్ శాతం నమోదైంది. ఇందులో పురుష ఓటర్ల పోలింగ్ శాతం 70.85 శాతం, మహిళ ఓటర్ల పోలింగ్ శాతం 85.13గా నమోదైంది. 11 మండలాల పరిధిలో మొత్తం 2,76,858 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుష 1,27,195 కాగా మహిళ ఓటర్లు 1,49,655 మంది ఉన్నారు. ఇందులో 90,113 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 1,27,399 మంది మహిళలు సర్పంచ్ ఎన్నికల్లో తమ ఓట్లు వేశారు. మొత్తం 2,17,512 మంది తొలిపోరులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ 11 మండలాల్లో అత్యధికంగా ఏర్గట్ల మండలంలో 81.39 శాతం పోలింగ్ కాగా అత్యల్పంగా ఆర్మూర్ మండలంలో 76.44 శాతం పోలింగ్ జరిగింది.

205
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...