కాకతీయ సాండ్ ‘లీడ్ ప్రయాణం’ ప్రారంభం


Tue,January 22, 2019 01:49 AM

నిజామాబాద్ స్పోర్ట్స్ : దేశ్ ఫౌండేషన్ కాకతీయ సాండ్ బా క్స్ ఆధ్వర్యంలో ‘లీడ్ ప్రయాణం’ అ నే బస్సు యాత్రను ప్రారంభించారు. యువతలో నాయకత్వపు లక్షణాలను పెంపొందించి వారి లక్ష్యాలను అధిగమించేందుకు దేశ్ చేస్తున్న కృషి లో భాగంగా సోమవారం వినాయక్ రుక్మిణీ ఛాంబర్ ఉన్న కాకతీయ సాండ్ సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించా రు. విద్యార్థి దశలోనే నాయకత్వపు ల క్షణాలు, ఎంచుకున్న లక్ష్యాలను సు లువుగా అధిగమించే దిశగా వివిధ ప్రయోగాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థులు ఎంపిక చేసుకున్న అంశాల్లో కిందిస్థాయి నుంచి వివిధ రంగాలలో ఉన్నత స్థాయికి రాణిస్తున్న ప్రముఖులను కలుసుకుని వారితో ముఖాముఖి అయ్యే సువర్ణావకాశాన్ని ఈ లీడ్ ప్రయాణం కల్పిస్తుంది. సుమారు 45 మంది విద్యార్థులతో కూడిన ఈ బస్సు యాత్రలో తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాల నుంచి సుమారు 1,500 వందల కిలోమీటర్ల దూరం ప్రయాణాన్ని కొనసాగించనున్నారు. అయితే జిల్లా కేంద్రంలో పర్యటించిన అనంతరం సిద్దిపేట్, వరంగల్, లక్నవరం, హైదరాబాద్, నల్గొండ, కర్ణాటక తదితర ప్రాంతాల్లోని ప్రముఖులతో చర్చిస్తూ వారి విజయ సూత్రాలను తెలుసుకుంటారు. 14 రోజుల పాటు ఈ ప్రయాణం కొనసాగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ ఎస్ డీజీఎం రవీంద్రనాయక్ ముఖ్యఅతిథులుగా హాజరై బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను వారు అభినందించి 14 రోజుల ప్రయాణంలో నూతనోత్సాహంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం మేనేజర్ గాజుల ప్రవీణ్, లీడ్ ప్ర యాణ బృందం పాల్గొన్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...