జాతీయస్థాయి హ్యాండ్ రిషీతకు స్వర్ణం


Tue,January 22, 2019 01:49 AM

నిజామాబాద్ స్పోర్ట్స్ : జాతీయ స్థాయి హ్యాండ్ చాంపియన్ సాధించి స్వర్ణ పతకం గెలుచుకున్న తెలంగాణ రాష్ట్ర జట్టులో జిల్లాకు చెందిన చల్ల రిషీత కీలక పాత్రను వహించింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడల్లో భాగంగా ఇటీవల సిద్దిపేట్ నిర్వహించిన 64వ జాతీయ స్థాయి అండర్-17 బాలబాలికల హ్యాండ్ చాంపియన్ విజయ్ హైస్కూల్ 10వ తరగతి చ దువుతున్న రిషీత తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. దేశవ్యాప్తంగా సుమారు 29 రాష్ర్టాల జట్లు ఈ టో ర్నీలో పాల్గొనగా ఆడిన ప్రతి మ్యాచ్ రిషీత తనదైన శైలి లో ప్రతిభను ప్రదర్శించింది. ప్రతి మ్యాచ్ ప్రత్యర్థులపై గోల్ చేయడమే లక్ష్యంగా చేసుకుని టోర్నీ మొత్తంలో ఏడు గోళ్లను సాధించడమే కాకుండా జట్టు విజయానికి కీలకపాత్రను పోషించింది. దీంతో 2018-19 జాతీయ స్థాయి హ్యాండ్ చాంపియన్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సోమవారం పాఠశాల యాజమాన్యం ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ అమృతలత, కరస్పాండెంట్ వి.ప్ర భాదేవిలు జ్ఞాపికను, ప్రశం సా పత్రాలతో అభినందించా రు. ఇలాంటి మరెన్నో విజయాలు సాధించి పాఠశాల కు, జిల్లాకు, రాష్ర్టానికి తల్లిదండ్రులకు మంచిపేరు తే వాలని ఆకాంక్షించారు. కా ర్యక్రమంలో అకాడమీక్ డైరెక్టర్ టి.వసంత, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ పి.సుజాత, ప్రిన్సిపాల్ పి.విజేత, వైస్ రేఖ పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...