టీయూలో చెలరేగిన మంటలు


Tue,January 22, 2019 01:49 AM

డిచ్ నమస్తేతెలంగాణ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టీయూ బాలికల వస తి గృహం పక్కన మొదలైన మంటలు కాలుతూ సుమారు అర కిలో మీటర్ పొడవున పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అదే సమయంలో గాలు లు వీయడంతో మంటలు ఒక్కసారిగా అటవీ ప్రాంతమంతా అంటుకుంటూ పరిపాలన భవనం వరకు వ్యాపించాయి. పరిపాలన భవనానికి రెండు దిక్కుల టెలిఫోన్ కేబుల్ వైర్లు, ఇంటర్నెట్ సం బంధించిన వైర్లు సైతం ద గ్ధమయ్యాయి. దీంతో ఇం టర్నెట్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ప్రమా దం విషయాన్ని టీయూ అధికారులు ఇందల్ యి ఫైర్ స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చా రు. అప్పటికే అటవీ ప్రాంతంలోని మొక్కలు కాలిబూడిదయయ్యాయి. ఫైర్ సిబ్బంది పరిపాలన భవనం ఎదురుగా వ్యాపిస్తున్న మంటలను ఆర్పివేశారు. విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ బలరాములు బయటకు వచ్చి అగ్ని ప్రమాదం విషయ న్ని వీసీ సాంబయ్యకు ఫోన్ వివరించారు. ప్ర మాదంలో టీయూ పరిపాలన భవనం ఎదుట హ రితహారంలో నాటిన మొక్కలు పూర్తిగా కాలిపోయాయి. టీయూలో గతంలోనూ రెండు సార్లు అ గ్ని ప్రమాదం సంభవించి మొక్కలు పూర్తిగా దగ్ధ మైన విషయం తెలిసిందే. ప్రమాదం విషయం తెలుసుకున్న పరిపాలన సిబ్బంది ఆరుబయటకు వచ్చి చూశారు. ఇందల్వాయి ఫైర్ అధికారి రంజిత్ సిబ్బంది లక్ష్మీనర్సయ్య, సురేశ్, భూమేశ్, అనంతరాజ్ తదితరులు పాల్గొన్నారు.

179
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...