తొలివిడత @ 78.56 %


Tue,January 22, 2019 01:48 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో తొలివిడత గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో 177 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే 36 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 141 సర్పంచ్ స్థానాలకు, 1,004 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ బరిలో 545 మంది ఉండగా వార్డు సభ్యుల స్థానాల కోసం 2,386 మంది పోటీలో నిలిచారు. కాగా తొలివిడత పోరులో మొత్తం 78.56 పోలింగ్ శాతం నమోదైంది. ఇందులో పురుష ఓటర్ల పోలింగ్ 70.85 శాతం, మహిళ ఓటర్ల పోలింగ్ శాతం 85.13గా నమోదైంది. 11 మండలాల పరిధిలో మొత్తం 2,76,858 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 1,27,195 కాగా మహిళా ఓటర్లు 1,49,655 మంది ఉన్నారు. ఇందులో 90,113 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 1,27,399 మంది మహిళలు సర్పంచ్ ఎన్నికల్లో తమ ఓట్లు వేశారు. మొత్తం 2,17,512 మంది తొలిపోరులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 11 మండలాల్లో అత్యధికంగా ఏర్గట్ల మండలంలో 81.39 శాతం పో లింగ్ కాగా అత్యల్పంగా ఆర్మూర్ మండలంలో 76.44 శాతం పోలింగ్ నమోదైంది.

పోలింగ్ సరళి ఇలా...
కమ్మర్ మండలంలో 78.29శాతం, మోర్తాడ్ మండలంలో 79.53 శాతం, ఏర్గట్ల మండలంలో 81.39 శాతం, భీమ్ మండలంలో 76.97 శా తం, ముప్కాల్ మండలంలో 80.88 శాతం, బా ల్కొండ మండలంలో 79.39 శాతం, వేల్పూర్ మం డలంలో 78.6 శాతం, మెండోరాలో 79.53 శాతం పోలింగ్ నమోదైంది. నందిపేట్ 77.70 శాతం, ఆ ర్మూర్ 76.44 శాతం, జక్రాన్ 80.76 శాతం పో లింగ్ నమోదైంది. మెండోరా, ముప్కాల్, బాల్కొండ, ఏర్గట్ల, వేల్పూర్, కమ్మర్ మండలాల్లో పోలింగ్ బూత్ కలెక్టర్ రామ్మోహన్ సందర్శించి పోలింగ్ సరళిని, వివరాలను అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాలను పరిశీలించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో సోమవారం జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
ఆర్మూర్ మండలంలో 13 గ్రామ పంచాయతీల్లో 76.44 పోలింగ్ శాతం నమోదైంది. ఆర్మూర్ అంకాపూర్, దేగాం, ఆలూర్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రామ్మోహన్ మగ్గిడిలోని పోలింగ్ కేంద్రాన్ని జడ్పీ సీఈవో వేణు, చేపూర్ పోలింగ్ కేంద్రాన్ని డ్వామా పీడీ రమేశ్ రాథోడ్ పరిశీలించారు. నందిపేట్, ఆంధ్రనగర్ పోలింగ్ కేంద్రాలను సీపీ కార్తికేయ పరిశీలించారు. అలాగే డీపీవో కృష్ణమూర్తి నందిపేట్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

125
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...