తొలి విడతకు సర్వం సిద్ధం


Mon,January 21, 2019 12:28 AM

కమ్మర్‌పల్లి/నమస్తే తెలంగాణ: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలివిడత పోలింగ్ సోమవారం జరగనుంది. ఆ ర్మూర్ రెవెన్యూ డివిజన్‌లోని ఆర్మూర్, నందిపేట్, జక్రాన్‌పల్లి, కమ్మర్‌పల్లి, మోర్తాడ్, భీమ్‌గల్, వేల్పూర్, బాల్కొం డ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల మండలాల్లో నేడు సర్పం చ్, వార్డు సభ్యుల ఎన్నికకు పోలింగ్ జరుగుతుంది. ఉప సర్పంచ్‌ల ఎన్నిక సైతం నేడు జరుగుతుంది. ఆయా మండలాల్లో ఏకగ్రీవమైన సర్పంచ్ స్థానాలు, వార్డు స్థానాలు పోనూ మిగిలిన స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. తొలి విడత పోలింగ్ జరుగుతున్న ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో సర్పంచ్ బరిలో నిలిచిన 545 మందిలో నుంచి సర్పంచులుగా గెలిచే 141 మంది ఎవరో, వార్డు స్థానాల్లో పోటీలో నిలిచిన 2,386 మందిలో నుంచి వార్డు సభ్యులుగా గెలుపొందే 1,004 మంది ఎవరనే తీర్పును నేడు ఓటరు మహాశయులు ఇవ్వనున్నారు. తొలి విడత పో లింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

36 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం..
నేడు తొలి విడత పోలింగ్ జరగనున్న ఆర్మూర్ డివిజన్‌లో ఆర్మూర్, నందిపేట్, జక్రాన్‌పల్లి, భీమ్‌గల్, మోర్తాడ్, వే ల్పూర్, మెండోరా, ఏర్గట్ల, ముప్కాల్, బాల్కొండ, కమ్మర్‌పల్లి మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 177 సర్పంచ్ స్థానాలు, 1,746 వార్డు స్థానాలు ఉన్నాయి. 177 సర్పంచ్ స్థానాలకు గానూ 36 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 141 సర్పంచ్ స్థానాలకు సోమవారం (నేడు) పోలింగ్ జరుగుతుంది. ఏకగ్రీమైన సర్పంచ్ స్థానాలు పోనూ ఆర్మూర్ మండలంలో 13, బాల్కొండ మండలంలో 9, భీమ్‌గల్ మండలంలో 20, జక్రాన్‌పల్లి మండలంలో 18, కమ్మర్‌పల్లి మండలంలో 10, మెండోరా మండలంలో 9, మోర్తాడ్ మండలంలో 8, ముప్కాల్ మండలంలో 7, నందిపేట్ మండలంలో 29, వేల్పూర్ మండలంలో 12, ఏర్గట్ల మండలంలో 6 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.

736 వార్డులు ఏకగ్రీవం..
1,746 వార్డు స్థానాలకు గానూ ఆరు వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. భీమ్‌గల్ మండలంలో 2 వార్డులకు, మోర్తాడ్ మండలంలో 2 వార్డులకు, నందిపేట్ మండలంలో ఒక వార్డుకు, ఏర్గట్ల మండలంలో ఒక వార్డుకు నామినేషన్ రాలేదు. దీంతో మిగిలిన 1,740 వార్డుల్లో 736 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1,004 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ సిబ్బంది ఆదివారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.

ఉదయం 7గంటల నుంచి పోలింగ్
ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం 2గంటలకు వార్డుల ఓ ట్ల లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. అనంతరం సర్పంచ్ ఓ ట్ల కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. వీటి తర్వా త ఉప సర్పంచ్‌ల ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నికల ఏర్పాట్ల పై కలెక్టర్ రామ్మోహన్ రావు, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏర్పాట్లు తగిన విధంగా జరిగేలా చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎన్నికల పరిశీలకురాలు క్రిస్టీనా జడ్ చోంగ్తూ ఉన్నతాధికారులతో సమావేశాలు, సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఎన్నికలకు భారీ బందోబస్తు
నిజామాబాద్ క్రైం: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు పోలీసు కమిషనర్ కార్తికేయ తెలిపారు. ప్రజలందరూ ప్రశాంతంగా తమ ఓటు హక్కు ను వినియోగించుకోవాలన్నారు. శాంతిభ్రదతల సమస్య లు ఏర్పడితే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు ఫో న్ చేస్తే చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల బందోబస్తుకు 1,405 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ని జామాబాద్ పోలీసు కమిషనరేట్ 1, అదనపు డీసీపీ (ఎల్‌అండ్‌వో) 1, ఏసీపీలు 8 మంది, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు 25 మంది, సబ్ ఇన్‌స్పెక్టర్లు 80 మంది, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు 300 మంది, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు 600 మంది, హోంగార్డులు, మహిళా హోంగార్డులు 390 మందిని బందోబస్తు విధులకు నియమించినట్లు తెలిపారు.

186
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...