ఎమ్మెల్యే చొరవతో క్షేమంగా ఇంటికి..


Sun,January 20, 2019 02:25 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : ఏజెంట్ మోసానికి గల్ఫ్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆర్మూర్ వాసి ఎమ్మె ల్యే చొరవతో క్షేమంగా ఇంటికి చేరాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గల్ఫ్ డ్రైవర్ ఉద్యోగం కల్పిస్తామంటూ ఏజెంట్ చెప్పిన మాటలకు ఆర్మూర్ పట్టణం వొడ్డెర కాలనీకి చెందిన నల్లవెల్లి శివకుమార్ మోసపోయాడు. బహ్రె యిన్ శివకుమార్ దుర్భర జీవితాన్ని గడుపుతూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. డ్రైవర్ పని కోసం వెళ్లగా పనిలేదన్నారు. అక్కడ మొదట లేబర్ పని చేయించారు. తర్వాత అది కూడా లేదని చెప్పడంతో బహ్రెయిన్ ఆర్మూర్ వాసి శివకుమార్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నాడు. ఈ విషయాన్ని ఆర్మూర్ చెందిన టీఆర్ రాష్ట్ర నాయకుడు ఖాందేశ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే చొరవతో నల్లవెళ్లి శివకుమార్ ఆర్మూర్ చేరుకున్నారు.
ఆర్మూర్ చెందిన నల్లవెల్లి శివకుమార్ బహ్రెయిన్ లో డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తామని మ గ్గిడికి చెందిన ఏజెంట్ బోసు నర్స య్య అలియాస్ నర్సారెడ్డి నమ్మించాడు. డ్రైవర్ ఉద్యోగానికి మంచి జీ తం వస్తుందని నమ్మించి భీంగల్ చెందిన మరో ఏజెంట్ లింబన్న వద్ద కు తీసుకెళ్లి ఇద్దరు ఏజెంట్లు కలిసి బాధితుడు శివకుమార్ నుంచి లక్ష రూపాయలు తీసుకున్నారు. డ్రైవర్ ఉద్యోగం మంచి జీతం వస్తుందంటే న మ్మి శివకుమార్ అప్పు చేసి వారికి నగదు ఇచ్చి బహ్రె యిన్ వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత డ్రైవర్ ఉద్యోగం లేదని, లేబర్ పనిచేయాలని అక్కడి వారు సూచించారు. దీంతో శివకుమార్ ఏజెంట్లకు ఫోన్ చేస్తే మాకేం తెలియదని పట్టించుకోలేదు. పైగా నెలా 10 రోజులు లేబర్ పనిచేస్తే జీతం సైతం చెల్లించకపోవడం, తర్వాత లేబర్ పనికూడా లేదని చెప్పడంతో శివకుమార్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఖాందేశ్ శ్రీనివాస్ సదరు ఏజెంట్లపై శివకుమార్ కుటుంబ సభ్యులతో ఆర్మూర్ పోలీస్ కేసు నమోదు చేయించారు. అనంతరం ఈ విషయాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ దృష్టికి ఖాందేష్ శ్రీనివాస్ తీసుకెళ్లారు. ఎమ్మెల్యే జీవన్ బహ్రెయిన్ రాయబార కార్యాలయంలో, శివకుమార్ పనిచేసిన సదరు కంపెనీపై ఫిర్యాదు చేశారు. వెంటనే సదరు కంపెనీ వ్యక్తులు శివకుమార్ పాస్ అందజేయ గా, శివకుమార్ ఆర్మూర్ చేరుకున్నారు.

200
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...