ఉపాధ్యాయ జీవన ప్రమాణాలు పెంచుతాం


Sun,January 20, 2019 02:24 AM

నిజామాబాద్ స్పోర్ట్స్ : ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడిగా మరోసారి అవకాశాన్ని కల్పిస్తే ఉపాధ్యాయ జీవన ప్రమాణాలను మరింత పెంచుతానని ఎమ్మెల్సీ అభ్యర్థి భట్టాపురం మోహన్ కోరారు. రానున్న శాసనమండలి ఉపాధ్యాయ ఎన్నికల సందర్భంగా శనివారం ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ఆయన గెజిటెడ్ హెచ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలోనూ పీఆర్ తరఫున ఎమ్మెల్సీగా ఆరు సంవత్సరాలు పనిచేసి ఎన్నో ప్రభుత్వ ఉత్తర్వులను తీసుకొచ్చి వాటిపై పూర్తి అవగాహనతో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేశానన్నారు. ప్రస్తుతం రాజకీయాలకతీతంగా ఏ పార్టీతో ప్రమేయం లేకుండా స్వతంత్య్ర అభ్యర్థిగా 13జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ సంఘలంతా తనకు సంఘీభావం తెలుపుతూ మద్దతును ఇస్తున్నాయని తెలిపారు. అన్నివర్గాల ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం పాటుపడుతానన్నారు. ముఖ్యంగా పీఆర్ ఐఆర్ సాధించి పెడుతానని ఆయన తెలిపారు. ప్రధానంగా విద్యారంగంలో ఉన్న సమస్యలపై పూర్తిగా అవగాహన ఉందని, వీలైనంత త్వరలో అవకాశమిచ్చిన వారందరికి తగిన న్యాయం చేస్తానన్నారు. మరోసారి శాసనమండలి సభ్యుడిగా అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ఇందులో భాగంగా నగరంలోని పలు పాఠశాలలను సందర్శించారు. సమావేశంలో గెజిటెడ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.రాజ్ ప్రధాన కార్యదర్శి డి.మోహన్, కోశాధికారి ఎస్.సురేశ్, విశ్రాంత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...