మూడో విడత నామినేషన్లు షురూ..


Thu,January 17, 2019 02:32 AM

డిచ్‌పల్లి, నమసే ్తతెలంగాణ/మాక్లూర్/నవీపేట: మూడో విడతలో ఎన్నికలు జరిగే డిచ్‌పల్లి, నిజామాబాద్ రూరల్, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, మోపాల్, నవీపేట, మాక్లూర్ మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఆయా మండలాల పరిధిలో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నామినేషన్ల మొదటి రోజు బుధవారం కనుమ పండుగ కావడంతో అభ్యర్థులకు మంచిరోజు కాకపోవడంతో చాలా మంది నామినేషన్ల పత్రాలను రిటర్నింగ్ అధికారుల వద్ద స్వీకరించారు. గురు, శుక్రవారాల్లో నామినేషన్లు వేసేందుకు నిర్ణయించుకున్నారు. కొన్ని గ్రామాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే సర్పంచ్, వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేశారు. డిచ్‌పల్లి మండలంలోని ధర్మారం(బి), నడిపల్లి, ఖిల్లా డిచ్‌పల్లి, యానంపల్లి, రాంపూర్ గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈనెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ, 19న స్క్రూటినీ, 20న ఏవైనా అభ్యంతరాలు ఉంటే అప్పీలు, 22న విత్‌డ్రాలు, అదే రోజు సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల గుర్తుల ప్రకటన ఉంటుంది. 30న ఎన్నికల నిర్వహన, అదేరోజు ఫలితాల విడుదల ఉంటుందని డిచ్‌పల్లి ఎంపీడీవో మర్రి సురేందర్ తెలిపారు. మండలంలో కొత్తగా ఏర్పడిన ఐదు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ సహా వార్డు ్డసభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మండలంలోని సుద్దపల్లి సర్పంచ్‌గా పానుగంటి రూప, దేవ్‌పల్లిలో ఉస్నూరి ఆనంద, ఖిల్లా డిచ్‌పల్లి తండాలో సర్దార్ నాయక్, మిట్టపల్లి తండాలో సంతోష్‌నాయక్, యానంపల్లి తండాలో బి.బలరామ్‌ను సర్పంచ్‌గా గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని 34 గ్రామ పంచాయతీ స్థానాలకు, 306 వార్డు సభ్యులకు బుధవారం మొదటి రోజు ఐదు నామినేషన్ల కేంద్రాల్లో 14 సర్పంచ్ స్థానాలకు, 7 వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలయ్యాయి.

నిజామాబాద్ రూరల్ మండలంలో
నిజామాబాద్ రూరల్ మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు గాను బుధవారం 10 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. 172 వార్డులకు గాను 21 మంది వార్డు సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు.

ఇందల్వాయి మండలంలో...
ఇందల్వాయి మండలంలోని గండితండా, వెంగల్‌పాడ్ తండా, ఇందల్వాయి తండా, కొత్తకోరుట్ల తండాల గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు. మండలంలో 23 గ్రామ పంచాయతీలకు గాను మొదటి రోజు బుధవారం నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. 100 వార్డు స్థానాలకు 8మంది నామినేషన్లు దాఖలు చేశారు.

ధర్పల్లి మండలంలో ...
ధర్పల్లి మండలంలో తొలిరోజు బుధవారం 26 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో గణపతినాయక్ తెలిపారు. మండలంలో ధర్పల్లి, ప్రాజెక్టు రామడ్గు, దుబ్బాక, దమ్మన్నపేట్ గ్రామాల్లో నామినేషన్ల కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, సర్పంచ్ స్థానాలకు 9 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానానికి 17 నామినేషన్లు ధాఖలైనట్లు ఆయన తెలిపారు. సర్పంచ్ స్థానానికి ధర్పల్లిలో మూడు, మైలారంలో రెండు, ప్రాజెక్టు రామడ్గులో-1, కేశారం, చల్లగర్గె, మరియ తండాలో ఒక్కో నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో తెలిపారు.

మోపాల్ మండలంలో...
మోపాల్ మండలంలో 21 గ్రామ పంచాయతీలకుగాను ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. 192 వార్డులకు గాను ముగ్గురు వార్డు సభ్యులకు తమ నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారులు తెలిపారు.

నవీపేట మండలంలో...
నవీపేట మండలంలో బుధవారం సర్పంచి స్థానాలకు 21 నామినేషన్లు , వార్డు స్థానాలకు 44 నామినేషన్లు దాఖలైనట్లు మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి సయ్యద్ సాజీద్ అలీ తెలిపారు. పొతంగల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ మద్దతుదారుడు తుంగినీ రవీందర్‌రావు గ్రామస్తులతో కలిసి ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. పొతంగల్‌లో సర్పంచ్ స్థానానికి మూడు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. రాంపూర్‌లో దొంత రుతు కల్పన, కోస్లీలో ఒకటి, అభంగపట్నం, అబ్బాపూర్(ఎం), మోకన్‌పల్లి, కమలాపూర్, గాంధీనగర్, ఆశానగర్ కాలోని గ్రామాల్లో సర్పంచ్ స్థానానికి ఒక్కో నామినేషన్ దాఖలైంది. అనంతగిరి, ధర్మారం,హన్మాన్‌ఫారం, బినోలా, అబ్బాపూర్(బి) గ్రామాల్లో రెండు చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. కేవలం పొతంగల్ గ్రామంలోనే మూడు నామినేషన్లు దాఖలయ్యాయి.

165
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...