పూత, పిందె జాగ్రత్త..!


Thu,January 17, 2019 02:32 AM

కోటగిరి: ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులోనూ మామిడి పంటలో పూత ఆశాజనకంగా ఉంది. ఈ ఏడాది మామిడిని విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో మంచి ధర పలికే అవకాశం కనిపిస్తోంది. అయితే లాభాలు కనిపించే దిశగా ఉన్న పూత,పిందెను కాపాడుకోవడంపై రైతులు తగిన జాగ్రత్తలు వహించాలి. ప్రస్తుతం వాతావరణం పరిస్థితులతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున తోటల్లో పూతను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. లేని పక్షంలో నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని కోటగిరి ఉద్యానవన శాఖ అధికారిణి శృతి తెలిపారు. మామిడి పంటలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో అధిక దిగుబడులు సాధించడంతో పాటు నాణ్యమైన కాయలు, పండ్లు పొందవచ్చు. సాధారణంగా మామిడిలో డిసెంబర్- జనవరి మాసం నుంచి పూత ప్రారంభం అవుతుం ది. సరైన చర్యలు చేపడితే పూత సరైన సమయంలో రావడమే కాకుండా అధిక దిగుబడులు పొందవచ్చని తెలిపారు.

పింద సమయంలో...
పిందలు బఠానీ, నిమ్మకాయ పరిమాణంలో ఉన్నప్పుడు రెండు నీటి తడులు 15 రోజుల వ్యవధిలో ఇస్తే కాయ నాణ్యత పెరుగుతుంది. కాయలు నిమ్మకాయ పరిమాణంలో ఉన్నప్పుడు 10 గ్రా. పోటాషియం నైట్రేట్‌ను (13-0-45 )లీటరు నీటిలో కలిపి 16 రోజుల వ్యవధిలో మూడు సార్లు పిచికారి చేస్తే కాయ సైజు పెరగడంతో పాటు నాణ్యత బాగుంటుంది.

పూతకు ముందు మామిడి చెట్టుకి విశ్రాంతి చాలా అవసరం. ఈ సమయంలో దున్నడం, ఎరువులు చల్లడం, కొమ్మ కత్తిరింపులు చేయకుండా చెట్టుకు విశ్రాంతినివ్వాలి. మామిడిలో పూత సరైన సమయానికి రావాలంటే నీటి యాజమాన్యం చాలా ముఖ్యం. అక్టోబర్ నుంచి నీరు పెట్టడం ఆపేయాలి. ఎక్కువగా నీరు అందిస్తే చెట్టు శాఖీయంగా పెరిగి పూత రావడం ఆలస్యం ఆవుతుంది. పూత సరైన సమయంలో సరిగ్గా రావాలంటే 10 గ్రా. పొటాషియం. నైట్రెట్‌ను (13-0-45) లీటరు నీటికి కలిపి సాయంత్రం పూట పిచికారి చేయాలి. పూతకు ముందు ఎక్కువగా చీడపీడల్లో ఆకు జల్లెడ గూడు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు ఆకుల మధ్యనున్న కణజాలాన్ని తీనేసి గూడు ఏర్పచుకొని అందులో నివసిస్తాయి. పూతకు వచ్చే కొమ్మలను తినేస్తుంది. ఈ పురుగుని గుర్తించిన వెంటనే పురుగు గూళ్లను కత్తిరించి కాల్చేయాలి. ఆ తర్వాత క్లొరిఫైరిఫాస్ 2 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. పూతకు వచ్చే కొమ్మలు గుత్తి లాగ కనిపించినప్పుడు( వెర్రితెగులు) ముందుగా ఆ గుత్తులను కత్తిరించి ఆ తర్వాత ఒక మి.లీ ప్లానోఫిక్స్(ఎన్‌ఎఎ) 4.5 లీ. నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.

147
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...