వైభవం..


Tue,January 15, 2019 05:39 AM

నిజామాబాద్ సిటీ : నగరంలోని సుభాష్‌నగర్ శ్రీరామాలయంలో సోమవారం గోదాదేవి రంగనాథుల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో పల్లకీసేవ జరిపారు. అనంతరం ప్రత్యేక ప్రాంగణం అలంకరణ చేసి గోదాదేవి రంగనాథులను ఉంచి వేదమంత్రాల మధ్య కల్యాణోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు తులసీ మురళీధర్ ఆచార్యులు, సహాయ అర్చకులు కందాళై సాయి రాఘవచార్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కల్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
జెండా బాలాజీ ఆలయంలో...
నగరంలోని కోటగల్లీ జెండా బాలాజీ ఆలయంలో సోమవారం గోదాదేవి రంగనాథుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు తిరుప్పావై ప్రవచనం గంధ పూజ, పండితులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

130
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...