అవనిపై హరివిల్లు


Mon,January 14, 2019 03:51 AM

నిజామాబాద్ స్పోర్ట్స్ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు రంగుల హరివిల్లును తలపించాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆదివారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో ఈ పోటీలు నిర్వహించారు. నాలుగేళ్లుగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఈ పోటీలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక ముగ్గుల పోటీల కోసం పాల్గొనే మహిళలు ప్రత్యేక ఆకర్షణ కనబరుస్తున్నారు. తమదైన శైలిలో ముగ్గులను వేయడంలో ఉత్సుహకతతో సిద్ధపడి ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. సుమారు 150మంది ఈ పోటీల్లో పాల్గొని రంగుల హరివిల్లును తలపించే విధంగా ఒకరికి మించి మరొకరు ముగ్గులు వేయడానికి పోటీ పడ్డారు. ఎప్పుడూ కనిపించని వెరైటీల ముగ్గులు వీక్షకుల్లో ఆసక్తిని నింపాయి. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతికుమార్ మాట్లాడుతూ.. జాగృతి జిలా మహిళా విభాగం సమన్వయంతో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొనే వారి సంఖ్య పెరగడం చాలా సంతోషకరమన్నారు.

మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి పండుగ వాతావరణాన్ని వారిలో చూడాలనే ఉద్దేశంతో జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆలోచనలు, సూచనల మేరకు ఈ పోటీలను నిర్వహించి విజయవంతం చేస్తున్నామని తెలిపారు. మొదటి మూడు స్థానాలు గెలుచుకునే వారెవరు అయినప్పటికీ పోటీల్లో పాల్గొనే వారి సంఖ్యతోనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు. ప్రథమ బహుమతి నాగలక్ష్మి, ద్వితీయ బహుమతి రజినీ, తృతీయ బహుమతి రేవతి గెలుచుకున్నారు. నగర మేయర్ ఆకుల సుజాత ముఖ్యఅతిథిగా హాజరై బహుమతులు ప్రదానం చేశారు. పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ఆమె ప్రత్యేకంగా అభినందించారు. మహిళలను ఉత్సాహపర్చేందుకు నిర్వహిస్తున్న పోటీలపై జాగృతి బృందాన్ని ఆమె ప్రశంసించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ బంగారు నవనీత, కార్పొరేటర్లు విశాలినీరెడ్డి, చాంగుబాయి, సువర్ణ, జాగృతి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ భరద్వాజ్, కుల్ రాజేశ్ యాదవ్, హరీశ్ యాదవ్, రంజిత్, మహిళా విభాగం నాయకురాలు అపర్ణ, పద్మ, వసంత, జాగృతి సభ్యులు రమేశ్ శ్రీకాంత్, అరుణ్, సంపత్, హరిప్రసాద్, రఘుపతి, సందీప్, సూర్య, శాంతి తదితరులు పాల్గొన్నారు.

169
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...