ప్రయాణ ప్రాంగాణాల్లో పండుగ రద్దీ


Sun,January 13, 2019 02:25 AM

ఎల్లమ్మగుట్ట : సంక్రాతి పండుగతో నిజామాబాద్ ఆర్టీసీ, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో సందడిగా మారింది. వారం రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో వివిధ ప్రాంతాలకు సెలవులతో గడిపేందుకు జనాలు అధిక సంఖ్యలో ప్రయాణాలకు సిద్ధమయ్యారు. బస్టాండులో ప్రయాణికుల తాకిడి పెరిగి బస్సులన్నీ కిక్కిరిసా యి. రెండో శనివారం, ఆదివారంతో పాటు సంక్రాంతి కలిసి రావడంతో పరిస్థితికి అనుగు ణంగా ఆర్టీసీ యాజమాన్యం మరో 40 ప్రత్యేక సర్వీసులను కేటాయించింది. ఈనెల 13వరకు ఇదే ప్రక్రియను కొనసాగించనున్నారు. రెగ్యులర్ సర్వీస్ కాకుండా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎక్స్ పల్లె వెలుగు బస్సులను సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ వరకు నడుపుతున్నారు. వరుసగా మూడురోజుల సెలవుల కారణంగా హైటెక్ సిటీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కాలేజీల విద్యార్థులు, బంధువులు, ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఇదో సువర్ణావకాశంగా రావడంతో ప్రస్తుతం ప్రయాణి కుల రద్దీ పెరిగింది.

ప్రత్యేకంగా కేటా యించిన 40బస్సులను ప్రతి 15నిమిషాలకు జూబ్లీ బస్ స్టేషన్ వరకు నడుపుతున్నారు. ప్రతిరోజూ నడిచే గుంటూరు, విజయవాడ, తిరుపతి, నెల్లూర్, ఒంగోలు, బస్సులు ఇవి సుమారు 20సర్వీసులు నిరంతర ప్రక్రియలో కొనసాగుతున్నాయి. ఉద యం 6గంటల నుంచి 12గంటల సమయం వర కు కొంత వెసులుబాటులో సమయాలను పొడ గించారు. బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ 1, 2 డిపోల నుంచి సైతం ప్రత్యేక బస్సులను కేటా యించారు. ప్రయాణికులు తమ భద్రత కోసం సీట్లను ఆపుకోవటంలో నానా తిప్పలు, ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తుగా చేతి రూమలు, వేసినప్పటికీ సీట్లు చెల్లుబాటు కాని పరిస్థితిలో ఏకంగా వారి చిన్నారులు, పిల్లలను సీట్లను ఆపేందుకు కిటికీల్లో నుంచి తోసేయటం కొసమెరుపు. పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు లేనప్పటికీ ప్రతి రైలు ప్రయాణీకుల రద్దీతో కిటకిటలాడుతోంది. నిర్ధిష్ట సమయపాలనతో నడిచే రైల్వే వ్యవస్థలో రైలు వచ్చి వెళ్లి సమయాల్లో ఉన్న సందడి తదనంతరం కనిపించటం లేదు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...