బుజ్జగింపులు.. ఊరడింపులు..


Sat,January 12, 2019 03:04 AM

మోర్తాడ్: గ్రామపంచాయతీ ఎన్నికలతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. దోన్ గ్రామానికి వచ్చిన రెండు నామినేషన్లలో గురువారం స్క్రూటినీ అనంతరం ఒక నామినేషన్ అధికారులు తిరస్కరించారు. దీంతో దోన్ సర్పంచి ఎన్నిక ఏకగ్రీవంగా మారింది. ఈ గ్రామం నుంచి నామినేషన్ వేసిన పర్సదేవన్న దాదాపుగా సర్పంచ్ ఎన్నిక అయినట్లే. అధికారులు ప్రకటించడమే తరువాయి. అయితే స్క్రూటినీ అనంతరం మరో మూడు గ్రామాల్లో రెండేసి నామినేషన్లు మాత్రమే మిగిలాయి. తిమ్మాపూర్, దొన్కల్, సుంకెట్ గ్రామాల్లో రెండు నామినేషన్ల చొప్పున మిగిలాయి. ఈ గ్రామాల్లో కూడా ఏకగ్రీవాల కోసం గ్రామస్తులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 13న సాయం త్రం ఐదు గంటల వరకు నామినేషన్ల విత్ సమ యం ఉన్నందున, ఎవరు విత్ అవుతారో లేదో వేచిచూడాల్సి ఉంటుంది. ఈ మూడు గ్రామాల్లో ఒక్కొక్కరు విత్ అయితే ఏకగ్రీవాలు అయినట్లే. విత్ కాకపోతే ద్విముఖ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏకగ్రీవాల కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక మండలంలోనే అత్యధికంగా పాలెం గ్రామంలో నామినేషన్లు వచ్చాయి. ఈ గ్రామం నుంచి ఎనిమిది నామినేషన్లు రావడం విశేషం. జనరల్ రిజర్వేషన్ రావడమే అందుకు కారణం. ఇదిలా ఉండగా ఈగ్రామం నుంచి కనీసం ముగ్గురు టీఆర్ సంబంధించిన వారు విత్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్రామపంచాయతీ సమరం ఆరంభం అవుతుండడంతో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చున్నా సర్పంచ్ అభ్యర్థులు, ఎవరు గెలుస్తారు అనే చర్చ కొనసాగుతోంది.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...