పేరుకే కూటమి


Tue,November 20, 2018 12:22 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: ప్రజాకూట మి.. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారింది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కలిసి ప్రజాకూటమిగా ఏర్పడ్డాయి. కూటమి సీట్ల సర్దుబాటులో సీపీఐ, టీజేఎస్‌లను ఆది నుంచే పరిగణలోకి తీసుకోలేదు. ఇక టీడీపీ రెం డు, మూడు స్థానాలు ఆశించినా పోటీ చేసేందుకు భయపడింది. సైకిల్ గుర్తు పై పోటీ అంటేనే జంకే పరిస్థితిలో నా యకులు వెనుకాడారు. దీంతో కాంగ్రెస్ మాత్రమే జిల్లాలో ని అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధమైంది. పేరుకు ప్రజా కూట మి అని పెట్టుకున్న ఎన్నికల బరిలో నిలిచి పోరాడేది ఒక్క కాంగ్రెస్ మాత్రమే. ఆ పార్టీ అభ్యర్థులు ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. సీట్ల సర్దుబాటు, టికెట్ల కేటాయింపులో తీవ్ర కాలయాపన చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం ఎట్టకేలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటికి అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి పోరు రాజేసి వదిలేసింది. తాంబూళాలిచ్చాం..

తన్నుకుచావండి అన్న చందంగా తెగేదాక లాగి అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఎలాగోలా నామినేషన్లు దాఖలు చేసి ఊపిరి పీల్చుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు ఇక ప్రచార బరిలోకి దిగేందుకు సమయాత్తమయ్యారు. బోధన్‌లో మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి కూటమి తరఫున ఎలాంటి సహకారం అందడం లేదు. అక్కడ టీడీ పీ సీనియర్ నాయకుడు అమర్‌నాథ్ బాబు తన అనుచరులతో మీటింగ్ పెట్టి సుదర్శన్‌రెడ్డి అంసతృప్తి వెల్లగక్కారు. నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ నుంచి తాహెర్‌బిన్ హం దాన్ టికెట్ రావడం ఆశవాహులు ఎవరూ జీర్ణించుకోవ డం లేదు. మహేశ్‌కుమార్ గౌడ్ తెర వెనుకే ఉండిపోగా నరాల రత్నాకర్ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. రూరల్ నియోజకవర్గంలో భూపతిరెడ్డి నామినేషన్‌కు కాంగ్రెస్, టీడీపీ నాయకులెవరూ హాజరుకాలేదు. అరికెల నర్సారెడ్డి అలకపానుపు ఎక్కాడు. నగేశ్ రెడ్డి, భూంరెడ్డి తదితరులు అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. బాల్కొండలో ఈరవత్రి అనిల్‌కు కూడా టీడీపీ వర్గీయుల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. మల్లికార్జున్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రాలేదు. ఆర్మూర్‌లో ఆకుల లలితకు వ్యతిరేకంగా రాజారాంయాదవ్ పనిచేస్తున్నారు.

ఒంటరి పోరులో కాంగ్రెస్...
ప్రజాకూటమి పేరుతో కాంగ్రెస్, టీడీపీల పొత్తు జిల్లాలో వికటించింది. సీట్ల సర్దుబాటు విషయంలో చివరి వరకు సస్పెన్స్ కొనసాగించి చివరకు అభ్యర్థుల ప్రకటనతో కూటమిలో కొత్త చిచ్చు రేపింది అధిష్ఠానం. ఈ కూటమి కుంప ట్లు ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. కాంగ్రెస్, టీడీపీల పొత్తు ఒక వైరాన్ని తీసుకువచ్చి పెట్టగా, కాంగ్రెస్ పార్టీలో ఒకరికి మించి పలువురు టికెట్లను ఆశించి భంగపడ్డ నేతలంతా ఇప్పుడు భగ్గుమంటున్నారు. వేరు కుంపట్లు పెడ్తున్నారు. కొందరు బరిలో స్వతంత్ర అభ్యర్థులుగా రెబల్‌గా నిలుస్తుండగా మరికొందరు అభ్యర్థులకు సహకరించకుం డా అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కూటమి అభ్యర్థుల్లో పరస్పర సహకారం లేక ఒంటరి పోరుతో నష్టం జరి గే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి అనూహ్యంగా కూటమి అభ్యర్థిగా డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ పేరు తెర పైకి రావడంతో స్వపక్షంలోనే అసంతృప్తి భగ్గుమన్నది.

చివరి నిమి షం వరకు టికెట్ తనకేనని భావించిన మహేశ్‌కుమార్ గౌ డ్ ఈ పరిణామంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పీసీసీ సెక్రెటరీ నరాల రత్నాకర్ ఢిల్లీలో చివరి నిమిషం వరకు విశ్వప్రయత్నాలు చేసి భంగపడ్డారు. నేడు రెబల్ అభ్యర్థిగా, ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. ఆ తర్వాత అర్బన్‌లోని తన అనుచర వర్గంతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ఈ నెల 24న 10వేల మందితో నగరంలో పెద్ద ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించారు. ఈ పరిణా మం కాంగ్రెస్ శిబిరంలో కలవరానికి గురి చేస్తున్నది. తాహె ర్ బిన్‌కు అటు టీడీపీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి పెద్దగా సహకారం లభించే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు బీజేపీ అర్బన్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ ధన్‌పాల్ సూర్య నారాయణ గుప్తా శివసేన అభ్యర్థిగా నామినేషన్ వేశారు.. రూరల్‌లో చివరి నిమిషం వరకు శక్తి వంచన లే కుండా టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డ అరికెల నర్సారెడ్డి.. భూపతిరెడ్డి అభ్యర్థిత్వం పై గుర్రుగా ఉన్నారు. ఆయ న అనుచర వర్గం తీవ్ర నైరాశ్యంలో ఉంది.

211
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...