ఇందూరులో వెల్‌నెస్ సెంటర్ సిద్ధం


Mon,November 19, 2018 02:52 AM

ఖలీల్‌వాడీ: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, జర్నలిస్టులు, పింఛనర్లకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీ సేవలే కాకుండా ఓపీ సేవలను సైతం అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగా వెల్‌నెస్ సెంటర్లను రాజధాని హైదరాబాద్‌లోని ఖైరతాబాద్,వనస్తలిపురంలో ప్రారంభించింది. మిగితా జిల్లాలకు చెందిన ఉద్యోగులు, జర్నలిస్టులు, పంఛనర్లకు కష్టం కాకుండా ఉండేందుకు పాత జిల్లా కేంద్రాల్లో వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇటీవలే అదిలాబాద్ జిల్లా కేంద్రంలో వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించింది.అదే తరహాలో నిజామాబాద్ పాత జిల్లా కేంద్రంలో వెల్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. నిజామాబాద్ నగరంలోని అక్షర భవన్ పక్కన గల పాత టీఎన్జీవోస్ భవనంలో ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో ఏర్పాటు పూర్తి అయినప్పటీకీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభించలేకపోయారు. త్వరలో వెల్‌నెస్ సెంటర్ ప్రారంభం కానుంది. ఉద్యోగులు, జర్నలిస్టులు, పింఛనర్లకు నగదు రహిత ఉచిత వైద్యసేవలు అందనున్నాయి. ముఖ్యంగా జర్నలిస్టులకు పరిమితి లేకుండా నగదు రహిత ఉచిత వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.

త్వరలో ఉచిత వైద్య సేవలు...
జిల్లాకేంద్రంలో ఉద్యోగులు, జర్నలిస్టులు, పింఛనర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెల్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. త్వరలో వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించనుంది. దీంతో ఉద్యోగులు, జర్నలిస్టులు, పింఛనర్లకు వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత ఉచిత వైద్యసేవలు అందనున్నాయి. వైద్యసేవల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉన్న దగ్గర నగదు రహిత ఉచిత వైద్యసేవలు అందించాలన్న సంకల్పంతో వెల్‌నెస్ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ వెల్‌నెస్ సెంటర్‌లో ఉద్యోగులు, జర్నలిస్టులు, పింఛనర్లకు వారి కుటుంబ సభ్యులకు డెంటల్, ఫిజియోథెరపీ, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, ఆర్థో, కంటి ఇతరత్రా సమస్యలకు సంబంధించిన స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ వెల్‌నెస్ సెంటర్‌లో వ్యాధినిర్ధారణ కోసం రక్త పరీక్షలు, ఎక్స్‌రే, ఈసీజీ, ఆల్ట్రాసౌండ్ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. ఈ వెల్‌నెస్ సెంటర్‌లో గైనకాలజిస్ట్, ఇతర వైద్య విభాగాలకు చెందిన వైద్యులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, నర్పులు, స్టాఫ్ నర్సులతో కలిసి మొత్తం 15మంది వైద్య సిబ్బందితో పూర్తి స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఫలించిన ఎంపీ కవిత కృషి...
అత్యంత కీలకమైన వెల్‌నెస్ సెంటర్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు కోసం ఎంపీ కల్వకుంట్ల కవిత చేసి కృషి ఫలించింది. తద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, జర్నలిస్టులు, పింఛనర్లకు ఉచిత వైద్యసేవలన్నీ అందుబాటులోకి రానున్నాయి. దాదాపుగా 1885 రకాల వ్యాధులకు సంబంధించిన వైద్యసేవలు ఉద్యోగులు,జర్నలిస్టులు, పింఛనర్లకు వారి కుటుంబ సభ్యులకు అందనున్నాయి. ఉన్న దగ్గరే నగదు రహిత ఉచిత వైద్యసేవలు అందించి ఆర్థిక ఆదుకోవాలన్న సంకల్పంతో ప్రభుత్వం వెల్‌నెస్ సెంటర్‌ను జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేయడంతో ఉద్యోగ, జర్నలిస్ట్ , పింఛనర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

174
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...