ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం తథ్యం


Mon,November 19, 2018 02:49 AM

నిజామాబాద్ రూరల్/ మోపాల్: రూరల్ నియోజకవర్గం నుంచి ఈసారి జరిగే ఎన్నికల్లో ప్రత్యర్థిగా బరిలో ఎవరున్నా తాను భారీ మెజార్టీతో విజయం సాధించడం తథ్యమని టీఆర్‌ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రూరల్ మండలంలోని తిర్మన్‌పల్లి గ్రామ పోచమ్మల(పెద్దమ్మతల్లి) సంఘం సభ్యులు 60 మంది టీఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, అజీమ్ ఆధ్వర్యంలో జిల్లా కే్రందంలోని బాజిరెడ్డి నివాస ప్రాంగణంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి బాజిరెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడంతో పాటు గ్రామాల అభివృద్ధికి పాటుపడ్డానన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి రూరల్ ఎమ్మెల్యే ప్రత్యర్థి అభ్యర్థి డి.శ్రీనివాస్‌పై 26 వేల మెజార్టీతో తాను విజయం సాధించానని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో కూడా ప్రత్యర్థులేవరైనా తాను విజయం సాధించడం తథ్యమని బాజిరెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. అన్నివర్గాల ప్రజల అభ్యున్నతి కోసం నాలుగేళ్ల కాలంలో పాటుపడిన టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో మళ్లీ టీఆర్‌ఎస్ పార్టీకే అధికారం కట్టబెట్టడం ఖాయమని స్పష్టం చేశారు.

కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలకు ప్రజలు ఎవరూ మోసపోవద్దని సూచించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో పోశెట్టి, రాములు, ఛత్రపతి, కోట రాములు, యువకులతో పాటు 60 మంది ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు కులాచారి దినేశ్‌కుమార్, గడీల శ్రీరాములు, కలగర శ్రీనివాస్‌రావు, క్యాతం హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు. మోపాల్ మండలం కులాస్‌పూర్ గ్రామానికి చెందిన దళిత మహిళలు, డ్వాక్రా గ్రూపు సంఘాల మహిళలు టీఆర్‌ఎస్‌లో ఆదివారం చేరారు. పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు అందిస్తున్నందున రానున్న కాలంలో కేసీఆర్ ఆధ్వర్యంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలవుతాయని భావిస్తున్నట్లు మహిళలు గోవర్ధన్‌కు తెలిపారు. అందుకే టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో ముబారక్‌నగర్ ఎంపీటీసీ హన్మాండ్లు, నాయకులు దేవేందర్, రైతుసమన్వయ సమితి కులాస్‌పూర్ కో-ఆర్డినేటర్ మందుల లక్ష్మణ్, మహిళా నాయకులు లక్ష్మి, రాజవ్వ, సావిత్రి, గంగవ్వ, విజయ తదితరులు పాల్గొన్నారు.

185
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...