బాజిరెడ్డిని గెలిపించుకోవాలి


Sun,November 18, 2018 03:04 AM

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ :ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించే బాజిరెడ్డి గోవర్ధన్‌ను ఈ ఎన్నికల్లో తప్పక గెలిపించాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలకు ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. శనివారం సుద్దపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. అనుక్షణం ప్రజల మధ్య ఉండే బాజిరెడ్డి గోవర్ధన్‌లాంటి నాయకుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే సమస్యలు పరిష్కరిస్తారన్నారు. గత ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, గడిచిన నాల్గున్నర ఏళ్లలో సీఎం కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేసి పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారన్నారు. చెరువులు బాగు చేసుకున్నామని, ఇంటింటికీ పింఛన్లు వస్తున్నాయని, మరోమారు ప్రజలు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఈ ప్రాంతానికి మంచిప్ప రిజర్వాయర్ ద్వారా సాగునీరు తెప్పించే పథకానికి రూ.372 కోట్లు మంజూరు చేయించారని తెలిపారు. ఆ పథకం పూర్తయితే బీడు భూములకు నీరంది బంగారు పంటలు పండుతాయని తెలిపారు. సుద్దపల్లి గ్రామాన్ని గతంలో ఎవరూ పట్టించుకోలేదని, బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఎంపీపీ దాసరి ఇందిర, కమ్మ సంఘం జిల్లా అధ్యక్షుడు కలగర శ్రీనివాస్‌రావు, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ నారాయణరెడ్డి, గ్రామ కోఆర్డినేటర్ లింగయ్య, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఒడ్డెం నర్సయ్య, మాజీ జడ్పీటీసీ కులాచారి దినేశ్‌కుమార్, టీఆర్‌ఎస్ యూత్ విభాగం అధ్యక్షుడు సతీశ్, నాయకులు లక్ష్మీనర్సయ్య, నల్లవెల్లి సాయిలు, కుమ్మరి చిన్న గంగారాం, క్రాంతి, ఎంబడి రెడ్డి, సంతోషం, సాయిలు, గంగారాం, గంగారెడ్డి, పానుగంటి నరేశ్, నాగేశ్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలి
ఇందల్వాయి : ప్రజాకూటమిని పాతర వేయాలని.. టీఆర్‌ఎస్‌కు ప్రజలు అండగా నిలవాలని జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలో శనివారం టీఆర్‌ఎస్ కార్యాలయంలో టీఆర్‌ఎస్ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రజా కూటమిని గెలిపిస్తే తెలంగాణను ఆగం చేస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి బాజిరెడ్డి గోవర్ధన్ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి కృషిచేసిందన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని గడిచిన నాలుగేళ్లలో బాజిరెడ్డి గోవర్ధన్ పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారని, మరోసారి ఆయనను గెలిపించాలన్నారు. టీఆర్‌ఎస్ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఆమె సూచించారు. తెలంగాణను మోసం చేసేందుకు ప్రజా కూటమి పేరిట ఓట్లు అడిగేందుకు వస్తున్నారని, వారిని తిరస్కరించాలని ప్రజలకు ఎంపీ పిలుపునిచ్చారు. సమావేశంలో వైస్ ఎంపీపీ ముత్యన్న, టీఆర్‌ఎస్ మండల నాయకుడు బాదావత్ రమేశ్ నాయక్, విండో చెర్మన్ మొచ్చ గోపాల్, చింతలపల్లి గోవర్ధన్ రెడి,్డ మాజీ సర్పంచ్‌లు చెలివేరి లావణ్య దాస్, పాశం కుమార్ ఎంపీటీసీలు శ్రీనివాస్,షేక్ హుస్సేన్, అణు హుస్సేన్, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ గంగాదాస్, బల్‌రాం, అరటి రఘు, కుంట నర్సారెడ్డి, మోతిలాల్, భూమన్న, ఎర్ర రాజేంధర్, చిన్ను శ్రీనివాస్‌రెడ్డి, జాగృతి మండల కన్వీనర్ గంగాధర్ గౌడ్,కిషన్, అంబర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఆశీర్వదించండి.. అండగా ఉంటాం
ధర్పల్లి : టీఆర్‌ఎస్‌ను మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేయడంతో పాటు అన్నివర్గాలకు అండగా ఉంటామని జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ధర్పల్లి మండలంలోని దుబ్బాకలో శనివారం ఆమె పర్యటించారు. గ్రామానికి విచ్చేసిన ఆమె గ్రామంలోని మహిళలు, గ్రామస్తులతో ఆప్యాయంగా పలకరించారు. అమ్మ బాగున్నారా... ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు, జీవనభృతి అందుతుందా.. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఎంపీతో కరచలనం చేయడానికి ఆసక్తి చూపారు. దీంతో ఎంపీ మహిళల వద్దకు వెళ్లి అందరికీ చేయి కలిపి ఆప్యాయంగా పలకరించారు. బాజిరెడ్డి గోవర్ధన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో ఎంతో అభివృద్ధి చేశానని, ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో ముందుకు సాగుతున్నానని.. ప్రజలు మరోసారి ఆశీర్వాదించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్‌పర్సన్ గడ్డం సుమనారెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నల్ల హన్మంత్‌రెడ్డి, రైతు సమన్యయ సమితి జిల్లా సభ్యులు, మండల కన్వినర్ పీసు రాజ్‌పాల్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ జీయర్ కిశోర్‌రెడ్డి, ఎంపీటీసీలు టీచర్ నర్సయ్య, సుజావోద్ద్దీన్, మురళీగౌడ్, పోశగౌడ్, నాయకులు చిన్నారెడ్డి, గంగారెడ్డి, భూమేశ్, శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.

291
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...