మంచిప్ప రిజర్వాయర్‌తో మహర్దశ


Thu,November 15, 2018 12:54 AM

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఏడు మం డలాల్లో ఉన్న లక్ష ఎకరాల భూములు మరికొద్ది రోజుల్లో సస్యశ్యామలం కానున్నాయి. మంచిప్ప రిజర్వాయర్‌తో ఈ భూములకు సాగునీరంది బంగారు పం టలు పండనున్నాయి. నిజామాబాద్ రూ రల్ నియోజకవర్గంలోని నాన్ కమాండ్ ఏరియాలో ఉన్న లక్ష ఎకరాల భూములకు సాగునీటి వసతి లేక దశాబ్దాలుగా బీడుగా మారాయి. మోపాల్ మండలంలోని గ్రామశివారులో రిజర్వాయర్ నిర్మిస్తే ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న సాగునీటి గోస తీరే అవకాశముంటుందని బాజిరెడ్డి గోవర్ధన్ సీఎం కేసీఆర్‌కు విన్నవించారు. అంతేగాకుండా ఇరిగేషన్ శాఖ అధికారులతో సమగ్రంగా సర్వే చేయించి అంచనా వ్యయంతో ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి పంపేలా కృషిచేశారు. సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి బీడు భూములను సాగులోకి తేవడానికి మంచిప్ప వద్ద 3.5టీఎంసీల నీటి సామర్థ్యంతో రిజర్వాయర్ ని ర్మాణానికి రూ.375కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో మంచిప్ప పెద్దచెరువు, కొండెం చెరువులను కలుపుతూ రిజర్వాయర్‌ను నిర్మించనున్నా రు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని లక్ష ఎకరాల భూములకు సాగునీటి సౌకర్యం లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించంలో సమైక్య పాలకులు దృష్టిసారించలేదు. దశాబ్దాలుగా రైతులు నీటి సౌకర్యం లేక తమ భూములను పడిత్‌గానే ఉంచారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పనులతో ఊతం..
ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన 20, 21ప్యాకేజీలకు సంబంధించిన పనులు చు రుగ్గా సాగుతున్నాయి. నవీపేట్ మండలంలోని బినోల గ్రామ సమీపంలో ప్రవహిస్తు న్న గోదావరి నీటిని ని జామాబాద్ రూరల్ మండలంలోని సారంగాపూర్ గ్రామం వరకు ట న్నెల్(సొరంగం), పంపుహౌస్ తదితర పనులు 20 ప్యాకేజీ కింద చేపట్టేందుకు ప్రభుత్వం రూ.892 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టిన టన్నెల్, పంపుహౌస్ కాలు వ నిర్మాణపు పనులు తుదిదశకు చేరుకున్నాయి.

21ప్యాకేజీ పనులకు రూ.1143.70కోట్లు ..
కాళేశ్వరం 21-ప్యాకేజీ కింద నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.1143.70కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో టన్నెల్ పనులు వేగవంతంగా జరగడంతో చివరి దశకు చేరుకున్నాయి. కొండెం చెరువు పక్కన పంపుహౌస్ నిర్మాణం ముగింపు దశకు చేరుకుంది.

అండర్ గ్రౌండ్ పైపులైన్ ద్వారా నీటి సరఫరా...
రాష్ట్రంలో తొలిసారిగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కాళేశ్వరం 21-ప్యాకేజీ కింద కేటాయించిన భూములకు అండర్‌గ్రౌండ్ పైపులైన్ సహాయంతో నీటిని సరపరా చేసేలా ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. పైపులైన్ నిర్మాణానికి రూ.2,248 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో కమ్మర్‌పల్లి మండలంలో పైపులైన్ ని ర్మాణ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. అం డర్‌గ్రౌండ్ పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేయడంతో నీరు వృథా కాదు. అంతేగాకుండా కాలువల కోసం రైతులు భూములు కోల్పోయే అవకా శం ఉండదు. కాలువల ద్వారా నీటి సరఫరా జరిగితే చిన్న, సన్నకారు రైతులు 5వేల ఎకరాల భూ ములను కోల్పోవాల్సి వచ్చేది. రైతులు తమ భూ ములను కోల్పోకుండా అండర్ గ్రౌండ్ పైపులైన్ సహాయంతో నీటి సరఫరాకు ఎంపీ కల్వకుంట్ల కవిత, అప్పటి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రం గా కృషిచేశారు. పైప్‌లైన్ ద్వారా సాగునీటి సరఫరా జరగడంతో ప్రభుత్వంపై అదనంగా రూ. 1500 కోట్ల భారం పడుతుంది. అయినప్పటికీ రై తుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పైపులైన్ సహాయం ద్వారా నీటి సరఫరాకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

2లక్షల ఎకరాలకు సాగునీరు...
మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణంతో పాటు పైపులైన్ సహాయంతో నీటి సరఫరా పనులన్నీ పూర్తయితే నిజామాబాద్ రూరల్ మండలంలో 1,821 ఎకరాలకు, డిచ్‌పల్లి మండలంలో 19, 439 , మోపాల్ మండలంలో 15,557, జక్రాన్‌పల్లి మండలంలో 14,419, ఇందల్వాయి మండలంలో 12,598, ధర్పల్లి మండలంలో 21,199 , సిరికొండ మండలంలో 19,741ఎకరాలకు కలి పి మొత్తం 1,04,774ఎకరాలకు సాగునీరు అం దనుంది. బాల్కొండ మండలంలోని భీమ్‌గల్, కమ్మర్‌పల్లి, మోర్తాడ్, వేల్పూర్, ఆర్మూర్, మాక్లూ ర్, జగిత్యాల్ జిల్లాలోని మెట్‌పల్లి మండలాల్లోని 150 గ్రామాల రైతులకు మరో లక్ష ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందనుంది.

గోదావరి నీటి మళ్లింపునకు లిఫ్ట్ చేయు విధానం ...
నవీపేట్ మండలంలోని బినోల నుంచి గోదావరి నీటిని టన్నెల్(సొరంగం) ద్వారా నిజామాబాద్ రూరల్ మండలంలోని సారంగాపూర్ వద్ద నిర్మిస్తున్న పంపుహౌస్‌కు తరలిస్తారు. ఇక్కడి నుంచి నీటిని లిఫ్ట్ చేసి నిజాంసాగర్ ప్రధాన కాలువలకు మళ్లిస్తారు. ఈ కాలువ ద్వారా న్యాల్‌కల్ మాసానీ చెరువులోకి నీరు చేరుతుంది. ఈ చెరు వు నుంచి నీటిని మళ్లీ న్యాల్‌కల్ వద్ద గల నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి మళ్లిస్తారు. ప్రధాన కాలువ 1.3కిలోమీటర్లు దాటిన తర్వాత రెగ్యులేటర్ నిర్మించి ఇక్కడి నుంచి మోపాల్, సిర్పూర్, నర్సింగ్‌పల్లి, ముదక్‌పల్లి శివారు గుండా టన్నెల్ ద్వారా మంచిప్ప వద్ద ఉన్న కొండెం చెరువుకు నీరు చేరుతుంది. ఇక్కడి నుంచి కాళేశ్వరం 21-ప్యాకేజీ కింద ఉన్న లక్ష ఎకరాల భూములకు అండర్ గ్రౌండ్ పైపులైన్ సహాయంతో నీటిని సరఫరా చేస్తారు. ఇదే ప్యాకేజీ కింద డిచ్‌పల్లి మండలంలోని మెంట్రాజ్‌పల్లి నిజాంసాగర్ ప్రధాన కాలువ వద్ద మరో రెగ్యులెటర్‌ను నిర్మించి పైప్‌లైన్ సహాయంతో 1.10లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందేలా చర్యలు తీసుకుంటారు.

205
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...