బాజిరెడ్డికి మద్దతుగా నుడా చైర్మన్, డైరెక్టర్ల ప్రచారం


Wed,November 14, 2018 01:44 AM

నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, డైరెక్టర్లు, టీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం రూరల్ మండలంలోని కొత్తపేట, సోమ్లానాయక్ తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లకు అభ్యర్థించారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటు పడుతున్న సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలంటే టీఆర్‌ఎస్ కే ఓట్లు వేయాలని కోరారు. ప్రచారం సందర్భంగా వృద్ధులు, మహిళలు, యువకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సానుకూలంగా స్పందించి తామం తా టీఆర్‌ఎస్‌కే మద్దతుగా ఉన్నామని నుడా చైర్మ న్, సభ్యులతో పేర్కొనడం విశేషం. గొర్లమంద వద్దకు వెళ్లి అక్కడ కాపల దారులతో పలకరించి టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని వారు కోరారు. అనంతరం నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న నుడా గ్రామాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతుగా తామంతా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సారి కూడా టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని మళ్లీ అధికారంలోకి రాబోతుందని సీఎంగా కేసీఆరే బాధ్యతలు స్వీకరించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రూరల్ నియోజకవర్గంలో బాజిరెడ్డి గోవర్ధన్ 50వేల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నుడా డైరెక్టర్లు ముస్కె సంతోష్, రాజేంద్రప్రసాద్, అభిలాష్‌రెడ్డి, అంబదాసు, అక్తర్, ముత్తకుంట విండో చైర్మన్ స్వామి, టీఆర్‌ఎస్ నాయకులు అంకల గంగాధర్, కొరవ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

215
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...