విజయవంతంగా ముగిసిన ఆత్మీయ సమ్మేళనాలు


Mon,November 12, 2018 02:21 AM

నిజామాబాద్ రూరల్: టీఆర్‌ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతుగా టీఆర్‌ఎస్ పార్టీకి అండగా నిలిచేందుకు ఆదివారం రెండుచోట్ల వేర్వేరుగా నిర్వహించిన రెండు సామాజిక వర్గాల కులస్తుల ఆత్మీయ సమ్మేళన సభలు విజయవంతంగా ముగిశాయి. ఈ సభలు టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది. రూరల్ నియోజకవర్గం స్థాయి రెడ్డి కులస్తుల ఆత్మీయ సమ్మేళన సభ మోపాల్ మండలంలోని బోర్గాం(పి) మొటాడిరెడ్డి కల్యాణ మండపంలో టీఆర్‌ఎస్ రైతు విభాగం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఈగ సంజీవ్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభకు వేల సంఖ్యలో రెడ్డి కులస్తులు తరలివచ్చి తమ ఐక్యతను చాటారు. టీఆర్‌ఎస్ పార్టీకే ఓట్లు వేసి బాజిరెడ్డి విజయానికి దోహదపడుతామని రెడ్డి కులసంఘాల నాయకులు సభలో స్పష్టం చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఊహించని రీతిలో ఈ సమ్మేళనానికి తరలివచ్చి టీఆర్‌ఎస్ పార్టీకి అండగా ఉంటామని భరోసా కల్పించడం విశేషం. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ పార్టీయేనని, సమ్మేళనానికి విశిష్ట అతిథిగా హాజరైన మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి పేర్కొన్నారు. రెడ్డి వర్గానికి చెందిన ప్రజలందరూ సిఎం కేసీఆర్‌కు అండగా నిలిచి టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించాల్సిన ఆవశ్యకతను గురించి వివరించారు.

వారం రోజుల నుంచి ఆత్మీయ సమ్మేళన సభను విజయవంతం చేసేందుకు మండలాల రెడ్డి సంఘాల నాయకులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించినందున సభ విజయవంతంగా ముగియడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బర్దీపూర్ శివారులో ఉన్న బృందావన్ గార్డెన్‌లో గొల్ల, కుర్మ యాదవ కులస్తుల ఆత్మీయ సమ్మేళన సభ కూడా విజయవంతంగా ముగిసింది. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, జిల్లా నాయకుడు దండు నర్సయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సభకు రూరల్ నియోజకవర్గం నుంచి సుమారు 5వేల మంది తరలిరావడం విశేషం. తమ వృత్తిని ప్రోత్సహించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేసి తాము ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దోహదపడిన సీఎం కేసీఆర్‌కే తామంతా అండగా ఉంటామని ఆత్మీయ సమ్మేళన సభలో స్పష్టం చేయడం గమనార్హం. ఈ రెండు చోట్ల జరిగిన సమ్మేళన కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

215
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...