పోలీస్ శాఖ అండగా ఉంటుంది..


Sun,October 21, 2018 04:40 AM

నిజామాబాద్ క్రైం : పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలో 19 మంది పోలీసు అమర వీరుల కుటుంబాల సభ్యులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సంక్షేమ సదస్సు కు అదనపు డీసీపీ ఆకుల రాంరెడ్డి హాజరై వారితో మా ట్లాడారు. అనంతరం ఆయన అమరవీరులైన వారి కుటుం బ సభ్యులతో ఒక్కొక్కరిని పిలిచి వారి సమస్యలు, సం దేహాలు అడిగి తెలుసుకొన్నారు. వాటిపై సత్వర చర్యలకు ఉత్తర్వులు జారీ చేశారు. అమరులైన పోలీసు కుటుంబాలకు అధికారులు ఎల్లవేళ్లల అందుబాటులో ఉండాలని అన్నారు. అమరవీరుల కుటుంబాలు అయోమయ పరిస్థితులు ఎదు ర్కోకుండా వారి కుటుంబాలకు పోలీస్ సిబ్బంది అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెం డెంట్లు ఎన్.జనార్దన్, సయ్యద్ మక్బూల్ హైమర్, ఎస్.శ్రీని వాస్, ఎన్‌ఐబీ, ఏఎస్సై కృష్ణారెడ్డితో పాటు డీపీవో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

191
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...