సిద్ధమవుతోన్న యంత్రాంగం


Sat,October 20, 2018 03:47 AM

నమస్తే తెలంగాణ ప్రతినిథి, నిజామాబాద్ : జిల్లాలో ఉన్న పోలింగ్ స్టేషన్లతో పాటు అదనంగా మరో 32 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఎం. రామ్మోహన్‌రావు అన్నారు. ప్రగతిభవన్‌లోని సమావేశపు మందిరంలో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పట్టణాల్లో 14 వందలు, గ్రామాల్లో 12వందల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉంటే అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి వస్తుందన్నారు. ఇందులో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలోని పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ కేంద్రం ఉండగా ఓటర్ల సంఖ్య పెరిగిన కారణంగా అదే కేంద్రంలో మరో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, కుమార్‌గల్లీ జీహెచ్‌ఎస్‌లో 3 పోలింగ్ స్టేషన్లు, శంకర్‌భవన్ పాఠశాలలో మూడు కేంద్రాలు, కోటగల్లి ప్రభుత్వ పాఠశాలలో ఓ కేంద్రం, గోల్డెన్ బ్లూబెల్ పాఠశాలలో మూడు కేంద్రాలు, కాటిపల్లి రవీందర్‌రెడ్డి బీఈడీ కళాశాలలో రెండు కేంద్రాలతో పాటు పలు పాఠశాలల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

నిజామాబాద్ గ్రామీణ అసెంబ్లీ పరిధిలో సారంగపూర్ చెరుకు అభివృద్ధి కార్యాలయం పోలింగ్‌కు అనుకూలంగా లేనందున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మార్చామన్నారు. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని దూద్‌గాంలోని పోలింగ్ కేంద్రాన్ని పాత ఎంపీపీఎస్‌కు, గుమ్మిర్యాల్ పోలింగ్ కేంద్రాన్ని ఎంపీపీఎస్‌కు, రామన్నపేట్‌లోని పోలింగ్ కేంద్రాన్ని ఎంపీపీఎస్‌కు, పడగల్‌లో పోలింగ్ కేంద్రాన్ని నూతనంగా నిర్మించిన పాఠశాల భవనంలోకి, పచ్చలనడుకుడలోని రెండు పోలింగ్ కేంద్రాలను అదే పాఠశాలలోని వేరే గదుల్లోకి మారుస్తున్నట్లు కలెక్టర్ ఎం. రామ్మోహన్‌రావు వివరించారు.

ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అందించిన సహకారాన్ని, ఎన్నికలు పూర్తయ్యే వరకు అందించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్ నాయకులు నవీద్, యాసీన్, టీడీపీ నుంచి రాజమల్లు, రవి, బీజేపీ నుంచి గంగాకిషన్, శ్యాంసుందర్, బీఎస్‌పీ నుంచి బీఆర్ గైక్వాడ్, సీపీఐ రమేశ్‌బాబు, ఎంఐఎం నుంచి మహ్మద్ షకీల్, ఐజాజ్, రైతు కాంగ్రెస్ నాయకులు హజ్రాబేగంతో పాటు నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ జాన్ శాంసన్, జిల్లా పరిషత్ సీఈవో వేణు, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, గోపీరాం తదితరులు పాల్గొన్నారు.

169
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...