జాతీయ స్థాయి టెన్నికాయిట్ పోటీలకు త్రిష ఎంపిక


Sat,October 20, 2018 03:44 AM

ఆర్మూర్ టౌన్ : వెస్ట్ బెంగాల్‌లో నిర్వహించే జాతీయ స్థాయి టెన్నికా యిట్ పోటీలకు ఆర్మూర్‌కు చెందిన కె.త్రిష ఎంపికైనట్లు టెన్నికాయిట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మోతె రామాగౌడ్, కార్యదర్శి బి.మల్లే శ్‌గౌడ్ తెలిపారు. ఈనెల 13 నుంచి 15 వరకు పెద్దపల్లిలో నిర్వహించి న నాలుగో సబ్ జూనియర్ తెలంగాణ రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ చాంపియన్‌షిప్ పోటీల్లో కె.త్రిష జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించి వ్యక్తిగతంగా ద్వితీయ స్థానం సాధించిందని తెలిపారు. జాతీయ స్థా యికి ఎంపికైన త్రిషను శుక్రవారం ఆర్మూర్‌లో నిర్వహించిన కార్యక్ర మంలో అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియే షన్ కార్యదర్శి ఎం.గంగామోహన్, జిల్లా బేస్‌బాల్ సంఘం కార్యదర్శి కె.నరేంద్రచారి, టెన్నికాయిట్ సంఘం సంయుక్త కార్యదర్శి భూపతి, ఎం.సుజాత, ప్రసాద్, ఎ.అశోక్, సురేశ్, ధర్మపతి పాల్గొన్నారు.

159
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...