ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తాం


Wed,October 17, 2018 02:30 AM

రుద్రూర్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చాలా అభివృద్ధి చేసిందని, ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే మరింత చేసి అభివృద్ధి చేసి చూపుతామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో దేవీ మండపాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించిన గ్రామస్తులకు, గ్రామాభివృద్ధి కమిటీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం గ్రామంలోని మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎస్సీ, బీసీ కమ్యూనిటీ హాళ్లను త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. శ్మశాన వాటిక విషయంలో గ్రామస్తుల ఒక నిర్ణయానికి వచ్చి తొందరగా స్థలం చూపించే ప్రయత్నం చేయాలని సూచించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమం పూర్తి కావచ్చిన సమయంలో చిన్న అపశృతి చోటుచేసుకుంది. దేవీమాత వద్ద ఏర్పాటు చేసిన టెంట్‌పై పటాకుల మిరుగు పడి మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ యువ నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ నారోజి గంగారాం, వైస్ ఎంపీపీ సంజీవ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ తోట శంకర్, పీఏసీఎస్ చైర్మన్ పత్తి రాము, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి బాలరాజు,గ్రామ అధ్యక్షుడు కరీం, ఎంపీటీసీ పట్టెపు రాములు, దస్తగిరి, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు శేఖర్, గ్రామస్తులు పాల్గొన్నారు.

191
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...