సీఎం కేసీఆర్ పెద్ద కొడుకులా ఆదుకుంటున్నారు


Mon,October 15, 2018 02:06 AM

సీఎం కేసీఆర్ ఓ పెద్ద కొడుకులా అన్నం పెడుతున్నాడని, కచ్చితంగా టీఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటేస్తామని ముక్త కంఠంతో ప్రజలు చెబుతున్నారని టీఆర్‌ఎస్ అర్బన్ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా అన్నారు. నగరంలోని ఆర్యనగర్ బ్యాంక్ కాలనీలో ఉన్న కమ్యూనిటీ హాల్‌లో ఆదివారం నిర్వహించిన టీవీ మెకానిక్ అసోసియేషన్ సమావేశంలో బిగాల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఇంట్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో లబ్ధి పొందిన వాళ్లే ఉన్నారని అన్నారు. అనంతరం టీవీ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు గణేశ్ గుప్తా సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి గణేశ్ గుప్తా కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. తాము టీఆర్‌ఎస్ వెంటే ఉంటామని తీర్మానం చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత, నుడా చైర్మన్ ప్రభాకర్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ ఎనగందుల మురళీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బిల్ల మహేశ్, టీవీ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బూస రవి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, సహాయ కార్యదర్శి రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి మహేందర్, ఈసీ మెంబర్లు గంగాధర్, రాము, భూమేశ్ తదితరులు పాల్గొన్నారు.

204
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...