అర్బన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థికి విశేష ఆదరణ


Sun,October 14, 2018 02:54 AM

నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. రెట్టించిన ఉత్సాహంతో తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా ఇంటింటి ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. శనివారం నగరంలోని 17వ డివిజన్ పరిధిలోని కోటగల్లీ, దోబీగల్లీలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. కారు గుర్తుకు ఓటువేసి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు బాగున్నాయని స్థానికులు ఈ సందర్భంగా తాజా మాజీ ఎమ్మెల్యేతో చెప్పారు. టీఆర్‌ఎస్ వెంటే మేమంతా ఉన్నామని ముక్త కంఠంతో నినదించారు.

ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యే వెంటే ఉంటామని మద్దతు తెలిపారు. సంఘీభావం ప్రకటించారు. గణేశ్ గుప్తా మాట్లాడుతూ.. నగరంలోని అత్యధికంగా పింఛన్లు పొందుతున్న 17వ డివిజన్‌కు చెందిన ప్రజలేనని, కల్యాణలక్ష్మి ద్వారా సీఎం కేసీఆర్ డబ్బులిచ్చారని, మీరు కల్యాణలక్ష్మి చెక్కుతో పాటు పెళ్లి కొడుకు, కూతురుకు చీరతో పాటు ప్యాంట్ బట్టలను ఇచ్చారని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారని తెలిపారు. కాలనీలోని మున్నూరు కాపు సంఘం దుర్కి తర్ప నెం 1, శివాజీనగర్ సభ్యులు ముక్త కంఠంతో మద్దతు తెలిపారన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేటర్లు సిర్ప సువర్ణ, రాజు, సాయిరాం, దారం సాయిలు, నాయకులు సుజిత్, సత్యప్రకాశ్, న్యాలం కిషన్, సూదం రవిచందర్, రాజేంద్ర ప్రసాద్, అంబాదాస్, ముచ్కూర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

194
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...