రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జిల్లాకు పతకాలు


Sun,October 14, 2018 02:53 AM

నిజామాబాద్ స్పోర్ట్స్ : తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జిల్లాకు ఏడు పతకాలు లభించాయి. తెలంగాణ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో రెండు రోజులుగా హైదరాబాద్‌లోని గచ్చిగౌలి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్లు ప్రతిభ కనబర్చి పతకాలను సాధించారు. అనిల్ నాయక్ డిస్కస్‌త్రోలో స్వర్ణ పతకం సాధించాడు. హెచ్.సునీల్ డిస్కస్‌త్రోలో కాంస్యం, షాట్‌ఫుట్‌లో రజత పతకాలు కైవసం చేసుకున్నాడు. తిరుమల్‌రావు షాట్‌ఫుట్‌లో రజత పతకం, ఆర్.శ్రీకాంత్ షాట్‌ఫుట్‌లో కాంస్యం, హైజంప్‌లో వై.సవిత స్వర్ణ పతకం, రంజిత స్వర్ణ పతకాలు సాధించారు. శనివారం హైదరాబాద్‌లో జిల్లా సంఘం కార్యదర్శి డి.సాయిలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర సంఘం నిర్వహణ కార్యదర్శి సారంగపాణి, శంకర్ పతకాలు సాధించిన విజేతలను అభినందించారు. జిల్లా సంఘం నిర్వహణ కార్యదర్శి యు.రాజాగౌడ్, కౌండిన్య అకాడమీ నిర్వహణ కార్యదర్శి పి.కపిల్, రాజు పాల్గొన్నారు.

164
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...