డీఈవోపై బదిలీ వేటు


Sat,October 13, 2018 12:50 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: జిల్లా విద్యాశాఖాధికారి నాంపల్లి రాజేశ్‌పై బదిలీ వేటు పడింది. ఆయన జిల్లాకు డీఈవోగా వచ్చి సరిగ్గా రెండేళ్లు అయ్యింది. ఈ రెండేళ్ల కాలంలో అనేక వివాదాలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డీఈవో నాంపల్లి రాజేశ్‌ను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డీఈవో బదిలీ స్థానికంగా ఇది చర్చనీయాంశమైంది. జిల్లాకు కొత్త డీఈవోగా దుర్గా ప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దుర్గా ప్రసాద్ హైదరాబాద్‌లో సర్వశిక్షా అభియాన్‌లో పరిపాలనా అధికారి (ఏవో)గా పనిచేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. నాంపల్లి రాజేశ్ బాధ్యతలు తీసుకున్న రెండు నెలల వ్యవధిలోనే పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పటి నుంచి ఆ ఆరోపణల పరంపర కొనసాగుతూ వచ్చింది. ఉపాధ్యాయ సంఘాల నేతలకు, డీఈవోకు మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది. డబ్బులిస్తే తప్ప రాజేశ్ పనిచేయరనే ప్రచారం ఊపందుకున్నది. ఈ క్రమంలో ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఇటీవల విచారణ అధికారిగా రమణాకుమార్ జిల్లాకు వచ్చినప్పుడు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆధారాలతో సహా రాజేశ్‌పై ఫిర్యాదులు చేయడంతో ఈ తతంగం పతాక స్థాయికి చేరుకున్నది. దీంతో దీన్ని ఉన్నతాధికారుల సీరియస్‌గా తీసుకున్నారు. రెండ్రోజుల క్రితమే దీనిపై వివరణ ఇవ్వాలని లేఖ రాసింది. అయితే రాజేశ్‌కు ఆ లేఖతో పాటు బదిలీ ఉత్తర్వులు ఒకే రోజు అందాయి. దీంతో వివరణ ఇచ్చే అవకాశాన్ని అధికారులు కల్పించలేదు.

రాజేశ్ బదిలీ వ్యవహారం జిల్లా ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాజేశ్ అవినీతిలో తోడుగా నిలుస్తున్నారంటూ బోధన్‌లో విధులు నిర్వహిస్తున్న గెజిటెడ్ హెచ్‌ఎంపై ఉపాధ్యాయ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఈయన పైనా వేటు పడక తప్పదంటున్నారు. అంతకు ముందు కొద్దిగా కొద్దిగా పాకుతూ వస్తున్న అవినీతి జాడలు.. రాజేశ్ పీరియడ్‌లో పతాక స్థాయికి చేరాయంటున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. ఏ పనిచేయాలన్నా ఆయన పైసా ఉంటేనే ఫైలు ముందుకు కదుపుతారనే ప్రచారం ఉంది. ఇదిలా ఉంటే.. అంతకు ముందున్న పర్సంటీజీల వ్యవహారాన్ని మరింతగా పెంచిన ఘతన రాజేశ్ దేనని చెప్పుకొస్తున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. పవిత్రమైన ఈ శాఖకు క్రమంగా అధికారులంతా భ్రష్టు పట్టించారనడానికి డీఈవో రాజేశ్ బదిలీ ఉదంతం నిదర్శనంగా నిలుస్తున్నది. అక్రమ డిప్యూటేషన్లలో భారీగా అవినీతి, ఆకస్మిక తనిఖీల పేరుతో మెమోలు జారీ చేయడం, ఆ తర్వాత సెటిల్‌మెంట్లు చేయడం డీఈవో కార్యాలయం అడ్డాగా నిత్యకృత్య మైపోయింది. దీనికి డీఈవో రాజేశ్ మూల్యం చెల్లించుకున్నారు. ఆయనను హైదరాబాద్ మోడల్ స్కూల్స్ విభాగానికి డీడీగా బదిలీ చేశారు.

247
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...