సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ


Mon,September 24, 2018 03:54 AM

ఆర్మూర్ టౌన్ : తెలంగాణ రాష్ట్ర స్థాయి 30వ అంతర్ జిల్లాల సబ్ జూనియర్ బాల బాలికల కబడ్డీ టోర్నమెంట్ ఆర్మూర్‌లోని జావిద్‌బాయ్ స్టేడియంలో అక్టోబర్ 12, 13, 14న నిర్వహించనున్నట్లు తెలంగాణ కబడ్డీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉషురెడ్డి తెలిపారు. ఆర్మూర్‌లో కబడ్డీ సంఘం రాష్ట్ర, జిల్లా ప్రతినిధులతో ఆదివారం సమావేశమై వివరాలు వెల్లడించారు. మూడు రోజుల పాటు విద్యుత్ కాంతుల మధ్య రాత్రి, పగలు టోర్నీ నిర్వహిస్తామన్నారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 31 జిల్లాల బాలబాలికల జట్లు ఈ పోటీల్లో పాల్గొంటాయని వివరించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ జీవో 365 ప్రకారం పది జిల్లాల కబడ్డీ సంఘం 31 జిల్లాల సంఘంగా ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆర్మూర్‌లో రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల సబ్ జూనియర్ టోర్నీ నిర్వహించడం ప్రతిష్ఠాత్మకమన్నారు. వెయ్యి మంది క్రీడాకారులు హాజరవుతారని, జిల్లా కబడ్డీ సంఘం బోర్డింగ్ , లాడ్జింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అనంతరం కబడ్డీ సంఘాల ప్రతినిధులతో జావిద్‌బాయ్ మినీ స్టేడియాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో కబడ్డీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ అజీజ్‌ఖాన్, జి.కర్తయ్య, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల కార్యదర్శులు రాజారెడ్డి, సాయన్న, కె.బాబు, నిజామాబాద్ జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు గడీల రాములు, కార్యదర్శి ఎం.గంగాధర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎ.సారంగపాణి, జిల్లా సంఘం ఉపాధ్యక్షుడు మోహన్‌దాస్, కోశాధికారి గంగాధర్, సురేశ్, వేముల నాగభూషణం, నగేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కురి లింగాగౌడ్, పీఆర్డీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పెంట జలంధర్, నాయకులు పోల మధుకర్, గంగామోహన్‌చక్రు, అంబల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

223
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...