బైబై .. గణేశా..


Mon,September 24, 2018 03:53 AM

నవీపేట : మండల కేంద్రంలో ఆదివారం రాత్రి గణేశ్ శోభాయాత్ర అట్టహాసంగా కొనసాగింది. గణేశ్ నిమజ్జన ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన 60 గణేశ్ ప్రతిమలను చిన్నారులు, పెద్దలు, మహిళలు, యువకులు ఆనందోత్సవాలు, కేరింతల మధ్య నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిజామాబాద్ రూరల్ ఇన్‌చార్జి సీఐ జగదీశ్ ఆధ్వర్యంలో ఎస్సై పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. 56 మంది ప్రత్యేక పోలీసులు బందోబస్తులో పాల్గోన్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. మండల కేంద్రంలో మొట్టమొదటగా ఆ నవాయితీ ప్రకారం రాంమందిర్ గణేశ్ నిమజ్జన యాత్రను స్థానిక ప్రజాప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు.11 రోజుల పాటు భక్తులతో విశేష పూజలు అందుకున్న లంబోదరుడు నదిలో నిమజ్జనానికి తరలివెళ్లారు. గణేశ్ నిమజ్జన ఉత్సవాలను తిలకించేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. యంచ గోదావరి వద్ద నిమజ్జన ప్రాంతం వద్ద టాస్క్‌ఫోర్స్ సీఐ రాథోడ్ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఏడు మాదిరిగానే ఈసారి కూడా మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన పులిహోర ప్రసాదాన్ని టీఆర్‌ఎస్ నాయకులు వి.మోహన్‌రెడ్డి, వి.న ర్సింగ్‌రావు, న్యాలకంటి అబ్బన్న, ప్రదీప్‌రావు, మువ్వ నాగేశ్వర్‌రావు, మోస్రా భూంరెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కె.రాజేందర్‌గౌడ్, వైస్ ఎంపీపీ జి. గోవర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీ సూరిబాబు, ఏఎం సీ మాజీ డైరెక్టర్ ఈఎం గంగాధర్, నాయకులు లోకం నర్సయ్య తదితరులు ఉన్నారు.

167
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...