ప్రశాంతంగా ముగిసిన శోభాయాత్ర


Mon,September 24, 2018 03:53 AM

నిజామాబాద్ క్రైం : జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన గణేశ్ నిమజ్జన శోభాయాత్ర కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశాంతంగా ముగిసింది. పోలీస్ కమిషనర్ కార్తికే పర్యవేక్షణలో మధ్యాహ్నం స్థానిక దుబ్బ ప్రాంతం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర నగరంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. యాత్ర ప్రశాంతంగా కొనసాగేందుకు పోలీసు శాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సీసీ కెమెరాల ద్వారా శోభాయాత్రను చిత్రీకరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో రూఫ్ టాప్ బందోబస్త్ ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేశారు. అల్లరి మూకలను గుర్తించేందుకు మఫ్టీలో సైతం పోలీస్ సిబ్బంది నిఘా పెట్టారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు, అర్సపల్లి చౌరస్తా, మాధవనగర్ బైపాస్ రోడ్, పూలాంగ్ చౌరస్తా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. బందోబస్తులో అదనపు డీసీపీలు శ్రీధర్ రెడ్డి, ఆకుల రాంరెడ్డితో పాటు నిజామాబాద్ ఏసీసీ శ్రీనివాస్ కుమార్, సీఐ జి.నరేశ్, వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు, ట్రాఫిక్ సీఐ నాగేశ్వర్ రావు, సంతోష్, కృష్ణ, అశోక్ రెడ్డి, జాన్‌రెడ్డి, లక్ష్మయ్య, ఆర్ముడ్ రిజర్వు బలగాలు పాల్గొన్నాయి.

149
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...