ప్రభుత్వ పథకాల అవగాహనకే ర్యాలీ


Fri,September 21, 2018 01:46 AM

నిజామాబాద్ స్పోర్ట్స్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాల అమలు కోసం ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకే ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు అన్నారు. నెహ్రూ యువకేంద్రం, క్షేత్ర ప్రచార విభాగ్ నగర పాలక సంస్థ, డీఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ప్రభుత్వ పథకాల అమలు ర్యాలీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని, ఈ పథకాల ల క్ష్యాలు అందుకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారులకు తెలిపేలా అవగాహన కల్పించినప్పుడే వా టిని సద్వినియోగం చేసుకోగలుగుతారన్నారు. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ఎం తోమంది లబ్ధిదారులకు అందుతుండగా మరింత క్షేత్రస్థాయి ప్రచారంతోఅర్హులైన లబ్ధిదారులు పథకాలను వినియోగించుకునే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఖలీల్‌వాడీలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి క్షేత్ర ప్రచార విభాగ అదనపు డైరెక్టర్ జనరల్ టీవీకే రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంతో మిషన్ ప్రవేశపెట్టిన నాటి నుంచి నేటి వరకు సుమారు 3లక్షల మంది మరణాలను తగ్గించగలిగామని తెలిపారు. స్వచ్ఛభారత్ సేవా కార్యక్రమంతో నిర్వహిస్తున్న ఈ మిషన్‌లో అమలవుతున్న తీరుతో ప్రజల ఆరోగ్యంతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలను ఆదర్శంగా తీసుకుని పరిసరాల శుభ్రతపై ఈ మిషన్ ఎంతో పని చేస్తుందన్నారు.

ముఖ్యంగా బహిరంగ మలవిసర్జన వ్యతిరేక ఉద్యమంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. అంతేగాకుండా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇస్తున్న తడి, పొడి చెత్తలను వేర్వేరుగా వేయాలని సూచించారు. 18ఏళ్ల పైబడిన ప్రతిఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఓటు నమోదు తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. భారతదేశాన్ని సన్మార్గంలో నడిపించేందుకు సరైన నాయకున్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని గుర్తు చేశారు. ప్రధానమంత్రి ఉజ్వల భవిత, హిందీ పక్షోత్సవ, సుఖన్య సమృద్ధి యోజన, బాలికలను రక్షిద్దాం, బాలికను చదివిద్దాం, టీకా రక్షకు సంబంధించిన ఇంద్రధనస్సు, దవాఖానలో ప్రసవాలు, తల్లి బిడ్డా క్షేమం, ప్లాస్టిక్ వాడకంతో అనర్థాలు తదితర అంశాలపై వివరించారు. స్వచ్ఛత హీ సేవ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆయన బహుమతుల ప్రదానం చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం, మున్సిపల్ కమిషనర్ జాన్ శ్యాంసన్, ఏడీ హరిబాబు, మున్సిపల్ కార్పొరేషన్ ఎస్‌ఈ సహదేవ్ రత్నకర్, ఇన్‌చార్జి డీఆర్‌బీవో వినయ్‌కుమార్, పర్యాటక శాఖాధికారి కె.సింహాచలం, ఐసీడీఎస్ అధికారి స్రవంతి, ఎన్‌వైకె సమన్వయకర్త ఎం.రాంచంద్రరావు, మెప్మా పీడీ రాములు, ఐఆర్‌సీఎస్ ఆంజనేయులు, రీజియన్ ఆర్గనైజర్ నవనీత, సీడీపీవో సౌందర్య తదితరులు పాల్గొన్నారు.

179
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...