ఇందూరు గౌరవం మళ్లీ ఇనుమడించేలా


Thu,September 20, 2018 01:07 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : రాష్ట్ర రాజకీయాల్లో జిల్లాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఉద్యమ సమయంలో తనకంటూ గుర్తింపును పొందిన ఇందూరు.. ఉద్యమమే ఊపిరిగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ పార్టీతో ఆది నుంచి కలిసి నడుస్తున్నది. కష్టాల్లో కూడా పార్టీ వెంట నడిచి మేమున్నామంటూ భరోసానిచ్చింది. ఉద్యమ దళపతి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సాధించిన తర్వాత అదే ఉత్సాహంతో గులాబీ జెండాకు అండదండలు అందించింది. గడిచిన సాధారణ ఎన్నికల్లో ఏకంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన తొమ్మిది నియోజకవర్గాలకు తొమ్మిందింటిని కైవ సం చేసుకొని చరిత్రను సృష్టించింది ఇందూరు టీఆర్‌ఎస్. ఎంపీ కవిత నేతృత్వంలో ఆమె మార్గ నిర్దేశనంలో గులాబీ దళంతో కలిసి కదంతొక్కిన ఇందూరు జనం అఖండ మెజార్టీని అందించి అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకున్నది. ఇది ఇందూరుకు దక్కిన గౌరవం. రాష్ట్రంలో ఏ జిల్లాకు లేని విధంగా ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న ఇందూరు టీఆర్‌ఎస్.. ఎంపీ కవిత నేతృత్వంలో మరోమారు ఈ చరిత్రను పునరావృతం చేసేందుకు సిద్ధమైంది.

ఆ మేరకు కవిత జిల్లా పై ప్రత్యేక నజర్ పెడుతూ వస్తున్నారు. సిట్టింగులకు అభ్యర్థిత్వాలు ఖరారైన నేపథ్యంలో ఇప్పటికే వారంతా కార్యరంగంలో దిగి ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ సందర్భంలో ఎంపీ కవిత ప్రత్యేకించి అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తల తో సమావేశాలు నిర్వహించారు. మం గళ, బుధ వారాల్లో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఆమె పర్యటించా రు. ప్రధానంగా గణేశ్ మండపాలను సందర్శించి ఆ దేవదేవుడి ఆశీస్సులు తీసుకోవడంతో పాటు అదే వేదికగా ప్రజలతో మమేకమవుతూ ముందు కు సాగారు. దీంతో పాటే ఆయా నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. మంగళవారం బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించిన ఎంపీ కవిత.. బుధవారం నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. పార్టీకి వెన్నంటి ఉండి, ప్రభుత్వంతో కలిసి నడిచిన ప్రతి కార్యకర్తను, నాయకులను పార్టీ గుర్తుంచుకొని సముచితంగా గౌరవించుకుంటుందనే సంకేతాలను ఇచ్చారు.

జిల్లాలో తొమ్మి ది స్థానాలు కైవసం చేసుకోవడంతో పాటు మేయర్, జడ్పీచైర్మన్ తదితర కీలక స్థానాలన్నీ టీఆర్‌ఎస్ చేజిక్కించుకున్న తరుణంలో మరోమారు ఇదే చరిత్రను పునరావృతం చేసి ఇందూరు గౌరవాన్ని మరింత ఇనుమడింప జేయాలని ఆమె భావిస్తున్నారు. దీని కోసం తనదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో అందరినీ ఒకతాటిపైకి తీసుకువచ్చి సమన్వయంతో ముందుకు సాగేలా దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతి చోట కార్యకర్తలు, నాయకులు ఎంపీ కవిత నాయకత్వంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ సందర్భంలో ఆమె పిలుపే ప్రభంజనంగా కార్యకర్తలు ఎన్నికల కదనరంగంలో దూకేందుకు టీఆర్‌ఎస్ అ భ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు సంసిద్ధ్దులయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇందూరు టీఆర్‌ఎస్‌కు ఉ న్న ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని కాపాడుకుంటూనే... ఇక్కడి ప్రజల ఆశీస్సులు నిండుగా మెండుగా ఉన్న నేపథ్యా న్ని సద్వినియోగం చేసుకొని, అఖండ మెజార్టీని సొంతం చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ఎంపీ కవిత క్షేత్రస్థాయి నుం చి కార్యకర్తలను కార్యోన్ముఖుల్ని చేస్తున్నారు.

200
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...