కొనసాగుతున్న ఆర్మూర్ అర్బన్ స్థాయి క్రీడలు


Thu,September 20, 2018 01:07 AM

ఆర్మూర్ టౌన్ : ఆర్మూర్ పట్టణంలోని జావీద్‌బాయ్ మినీ స్టేడియంలో బుధవారం రెండో రోజు అర్బన్ ఎస్‌జీఎఫ్ స్థాయి క్రీడా పోటీలు జరిగాయి. వాలీబాల్ సబ్ జూనియర్‌లో ఆర్మూర్ జడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాల ప్రథమ, విజయ్ హైస్కూల్ ద్వితీయ, ఖోఖో జూనియర్‌లో మామిడిపల్లి జడ్పీ హైస్కూల్ ప్రథమ, నలంద హైస్కూల్ ద్వితీయ, ఖోఖో సబ్ జూనియర్‌లో మామిడిపల్లి జడ్పీ హైస్కూల్ ప్రథమ, కాంతి హైస్కూల్ ద్వితీ య, జూనియర్ వాలీబాల్‌లో ఆర్మూర్ జడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాల ప్రథమ, సెయింట్ ఆన్స్ స్కూల్ ద్వితీయ స్థానాలు దక్కించుకున్నాయి. టోర్నీ కన్వీనర్ ఎం.మంజుల, టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి అలివేణి మంగ, పీడీ మల్లేశ్‌గౌడ్, టీజీ పేటా జిల్లా కార్యదర్శి పింజ సురేందర్, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకట్‌రాములు, రాజు, చిన్నయ్య, రమణ, సురేశ్, రాజు, అం జు, రవికాంత్ పాల్గొన్నారు.

213
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...