నిజాం షుగర్స్ కార్మికుల సంబురాలు


Thu,September 20, 2018 01:06 AM

బోధన్, నమస్తే తెలంగాణ: నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్‌కు 2015 డిసెంబర్ నుంచి వేతనాలు లేక అష్టకష్టాలు పడుతున్న ఫ్యాక్టరీ కార్మికులకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తీపి కబురు అందించారు. నిజాం షుగర్స్ కార్మికులకు లేఆఫ్ కాలానికి సంబంధించిన 27 నెలల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించబోతోందంటూ ఎంపీ కవిత కార్మిక సంఘాల ప్రతినిధులకు తెలిపిన నేపథ్యంలో కార్మికులు సంబురాలు చేసుకున్నారు. బుధవారం బోధన్ పట్టణం శక్కర్‌నగర్‌లోని నిజాం షుగర్స్ మెయిన్ గేట్ వద్ద వందలాది మంది కార్మికులు గుమిగూడి తమకు వేతనాలు రావటంలో ఎంతో కృషిచేసిన ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. కార్మిక సంఘం నాయకుడు, టీఆర్‌ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఎ.రజాక్ ఆధ్వర్యంలో కార్మికులంతా సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. 2015 డిసెంబర్ 23న ఎన్‌డీఎస్‌ఎల్ యాజమాన్యం ఫ్యాక్టరీకి లే అవుట్ ప్రకటించి, ఫ్యాక్టరీని మూసివేసిందన్నారు. దీంతో తామంతా రోడ్డుపై పడ్డామని, అప్పటినుంచి రెండున్నరేళ్లుగా వేతనాలు లేక జీవితాలను గడపామన్నారు. తాము పడుతున్న ఇబ్బందిని ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లగా ఆమె ఎంతో సానుకూలంగా స్పందించి, తమ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారన్నారు. సీఎం కేసీఆర్, ఎంపీ కవితకు తామంతా మద్దతుగా ఉంటామని తెలిపారు. ఈ సంబురాల్లో సీనియర్ కార్మిక నాయకుడు కె.నాగేశ్వర్‌రావు, వివిధ కార్మిక సంఘాల నాయకులు పి.శివరాములు, జె.మల్లేశం, అబ్దుల్ జలీల్, సూరజ్ ప్రసాద్, హుస్సేన్ ఖాన్, మొయిన్ ఖాన్, ముస్తాఫా, ఖాజా ఖాన్, బంజారా రెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

210
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...