బోధన్‌లో గణేశ్ మండపాలను సందర్శించిన ఎంపీ కవిత


Thu,September 20, 2018 01:06 AM

బోధన్, నమస్తే తెలంగాణ: పట్టణంలోని వివిధ గణేశ్ మండపాలను బుధవారం రాత్రి ఎంపీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఎంపీ వెంట బోధన్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఉన్నారు. ముందుగా శక్కర్‌నగర్‌లోని శ్రీకోదండ రామాలయంలో గణేశ్ మండపాన్ని సందర్శించారు. అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ జాగృతి బోధన్ నియోజకవర్గం కన్వీనర్ గట్టు హరికృష్ణ ఇంటికి వెళ్లి అక్కడ హరికృష్ణ కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపారు. అక్కడున్న గణేశ్ మండపాన్ని సందర్శించారు. ఆ తర్వాత రాకాసీపేట్‌లోని భీముని గుట్టపై సార్వజనిక్ గణేశ్ మండపాన్ని ఎంపీ సందర్శించారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. చక్రేశ్వరాలయంలో బోధన్ సార్వజనిక్ గణేశ్ మండపంలో పూజలు చేశారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. విద్యార్థులు ఆమెపై పూలవర్షం కురిపించారు. కవిత మహిళలతో కలిసి కొద్దిసేపు బతుకమ్మ ఆడారు. అనంతరం ఏకచక్ర గోశాలను సందర్శించారు.

125
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...