మహాకూటమి మాయమవడం ఖాయం


Wed,September 19, 2018 02:48 AM

నిజామాబాద్ రూరల్ : టీఆర్‌ఎస్ ప్రభంజనంలో మహాకూటమి మాయమవడం ఖాయమని రూరల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాజిరెడ్డి ఇంటిలో మంగళవారం డిచ్‌పల్లి మండలంలోని ధర్మారం(బి) గ్రామానికి చెందిన వందమంది కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలగరి శ్రీనివాస్ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బాజిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. పులి వెంకటేశ్వర్‌రావు, బాబు, ఎండీ బాబా, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింలు, కృష్ణమూర్తి, నాగరాజు, నాగార్జునరావు, పాపరావు, మల్లేశ్, కిషోర్, రాంబాబు, కిరణ్, గంగాధర్‌లతో పాటు 100మంది ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా యువ నాయకుడు బాజిరెడ్డి జగన్, నాయకులు దినేష్‌కుమార్, కలగరి శ్రీనివాస్‌రావు, చిన్నుదొర, రిటైర్డ్ ఎక్సైజ్ ఎస్సై కిషన్ పాల్గొన్నారు.

163
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...