ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరికలు


Wed,September 19, 2018 02:47 AM

కమ్మర్‌పల్లి నమస్తే తెలంగాణ: మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో బీమ్‌గల్ మండలంలో చేరికలు కొనసాగుతున్నాయి. మంగళవారం బీమ్‌గల్ మండల కేంద్రంలోని రజక సంఘానికి చెందిన 50 కుటుంబాలు ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరాయి. ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మురళి ఆధ్వర్యంలో 20మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. చేంగల్ మాజీ ఎంపీటీసీ, మాజీ వైస్ ఎంపీపీ మోహన్‌గౌడ్ కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోచేరారు. సికింద్రాపూర్ మాజీ సర్పంచ్, ఎఫ్‌ఎస్‌సీఎస్ మాజీ చైర్మన్ కొనేరు బాలగంగాధర్ టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనతోపాటు 100 మంది యువకులు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ ప్రశాంత్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గుణ్వీర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దొన్కంటి నర్సయ్య, శర్మానాయక్, చౌట్‌పలి రవి, మల్లెల లక్ష్మణ్, ఒదిరే తిరుపతి, ఒదిరే గంగారామ్ తదితరులు పాల్గ్గొన్నారు.

193
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...